Telangana Corona Latest Report : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..

తెలంగాణలో కరోనా వ్యాప్తి కనిష్ఠ స్థాయిలో కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 14వేల 597 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా..

Telangana Corona Latest Report : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..

Telangana Covid Report

Updated On : May 2, 2022 / 10:07 PM IST

Telangana Corona Latest Report : తెలంగాణలో కరోనా వ్యాప్తి కనిష్ఠ స్థాయిలో కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 14వేల 597 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 28 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా హైదరాబాద్ లో 20 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మరో 32 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.

తెలంగాణలో ఇప్పటివరకు 7,92,072 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,87,630 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 331 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటివరకు రాష్ట్రంలో కొవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4,111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. కాగా, క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి. క్రితం రోజు రాష్ట్రంలో 9వేల 165 కరోనా పరీక్షలు నిర్వహింగా, 32 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.(Telangana Corona Latest Report)

Vaccination: ఒక్కరికీ వ్యాక్సిన్ బలవంతంగా వేయడానికి లేదు – సుప్రీం కోర్టు

అటు దేశంలో మరోసారి కరోనా కలకలం రేగింది. దేశవ్యాప్తంగా కోవిడ్ ఉధృతి కొనసాగుతోంది. వరుసగా ఐదో రోజు మూడు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం భయాందోళనలు రేకెత్తిస్తోంది. కాగా, ముందురోజు కంటే కేసులు కాస్త తగ్గాయి. ఢిల్లీ, హరియానా సహా పలు రాష్ట్రాల్లో ఇన్ఫెక్షన్ల సంఖ్య పెరుగుతోంది.

Telangana Reports 28 New Corona Cases In Past 24 Hours

Telangana Reports 28 New Corona Cases In Past 24 Hours

ఆదివారం సెలవురోజు కావడంతో నిర్ధారణ పరీక్షల సంఖ్య తగ్గింది. నిన్న 2.95 లక్షల పరీక్షలు నిర్వహించగా.. 3వేల 157 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఢిల్లీలో 1,485, హరియానాలో 479 కేసులొచ్చాయి. తర్వాతి స్థానాల్లో కేరళ(314), ఉత్తర్‌ప్రదేశ్‌(268), మహారాష్ట్ర(169) ఉన్నాయి. తాజాగా నమోదైన మొత్తం కేసుల్లో 86 శాతం మేర ఈ ఐదు రాష్ట్రాల నుంచే వచ్చాయి. ఒక్క ఢిల్లీ వాటానే 47.04 శాతంగా ఉంది. ఒక్కరోజు వ్యవధిలో మరో 26 మంది కరోనాతో మరణించారు. మొత్తంగా దేశంలో ఇప్పటివరకూ 4కోట్ల 30లక్షల 82వేల 345 కరోనా కేసులు నమోదవగా.. 5లక్షల 23వేల 869 మంది ప్రాణాలు కోల్పోయారు.

Covid Cases: చెలరేగుతున్న కరోనా.. దేశంలో 20వేల కేసులు

24 గంటల వ్యవధిలో మరో 2వేల 723 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 19వేల 500కు చేరింది. ఇప్పటివరకూ నమోదైన మొత్తం కేసుల్లో 98.74 శాతం మంది కరోనాను జయించగా.. 0.05 శాతం మంది వైరస్‌తో బాధపడుతున్నారు. మరోపక్క నిన్న 4.02 లక్షల మంది టీకా తీసుకోగా.. మొత్తంగా 189 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం వెల్లడించింది.(Telangana Corona Latest Report)

ఇది ఇలా ఉంటే.. వ్యాక్సిన్ తీసుకునే విషయంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. టీకా తీసుకోవాలని ఎవరినీ బలవంతం చేయలేమంటూ సోమవారం దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించవచ్చంది. పలు సేవలు పొందేందుకు టీకాను తప్పనిసరి చేయడం రాజ్యాంగ విరుద్ధమేనని పేర్కొంటూ పిటిషన్ దాఖలైంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజా రవాణాను వినియోగించుకోవడానికి, సబ్సిడీలో ఆహార ధాన్యాలు పొందడానికి పలు రాష్ట్రాలు టీకాను తప్పనిసరి చేయడాన్ని ఈ పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈ క్రమంలో జస్టిస్ ఎల్ నాగేశ్వర్రావు, జస్టిస్ బీఆర్ గావైతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పు ఇచ్చింది.