Telangana Corona Cases : తెలంగాణలో కరోనా పంజా.. భారీగా పెరిగిన కేసులు

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కొత్త కేసులు భారీగా పెరిగాయి. 3వేలకు చేరువగా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.

Telangana Corona Cases : తెలంగాణలో కరోనా పంజా.. భారీగా పెరిగిన కేసులు

Telangana Corona Cases

Updated On : January 18, 2022 / 10:43 PM IST

Telangana Corona Cases : తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కొత్త కేసులు భారీగా పెరిగాయి. 3వేలకు చేరువగా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. నిన్నటితో (2447) పోలిస్తే 536 కేసులు అధికంగా రావడం ఆందోళనకు గురి చేస్తోంది.

గడిచిన 24 గంటల్లో ఒక లక్ష 7వేల 904 కరోనా పరీక్షలు చేయగా 2వేల 983 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 1,206 కొత్త కేసులు వెల్లడయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 259, రంగారెడ్డి జిల్లాలో 227 కేసులు నమోదయ్యాయి.

Corona Medicines : హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నవాళ్లు తీసుకోవాల్సిన మందులు.. ప్రభుత్వం మార్గదర్శకాలు

అదే సమయంలో 2,706 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో ఇద్దరు కోవిడ్ తో మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,14,639 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,88,105 మంది ఆరోగ్యవంతులయ్యారు. రాష్ట్రంలో 22వేల 472 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4వేల 062కి పెరిగింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి మరోసారి కలకలం రేపుతోంది. రోజురోజుకి పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిత్యం లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ, ఫ్రంట్‌లైన్ వారియర్స్ సైతం కొవిడ్ బారిన పడుతున్నారు. ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, అధికారులను సైతం కోవిడ్ మహమ్మారి కంగారు పెడుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,38,018 కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 310 మంది మరణించారు. రోజురోజుకి పెరిగిపోతున్న పాజిటివ్ కేసులతో సర్వత్రా ఆందోళన నెలకొంది.