Telangana Latest Corona News : తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..

తెలంగాణ రాష్ట్రంలో క్రితం రోజుతో(21) పోలిస్తే కొత్త కేసుల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 12వేల 776 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా..

Telangana Latest Corona News : తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..

Telangana Covid Report

Updated On : April 25, 2022 / 9:14 PM IST

Telangana Latest Corona News : తెలంగాణ రాష్ట్రంలో క్రితం రోజుతో(21) పోలిస్తే కొత్త కేసుల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 12వేల 776 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 34 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా హైదరాబాద్ లో 26 పాజిటివ్ కేసులు వచ్చాయి.

అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 15 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. కొత్తగా కొవిడ్ మరణాలేవీ నమోదు కాలేదు. రాష్ట్రంలో ఇంకా 232 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటివరకు రాష్ట్రంలో కొవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4వేల 111. నేటివరకు రాష్ట్రంలో 7,91,827 కరోనా కేసులు నమోదవగా 7,87,484 మంది కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. కాగా, క్రితం రోజు రాష్ట్రలో 10వేల 132 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 21 మందికి పాజిటివ్ గా తేలింది.(Telangana Latest Corona News)

India Covid : కరోనా మనల్ని వదలదా ? ఫోర్త్ వేవ్‌‌కు సంకేతం!

కాగా, దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కలకలం చెలరేగింది. భారత్ లో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. దేశంలో కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 2వేల 541 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి మరో 30 మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ సోమవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 16,522 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి.

దేశంలో ఇప్పటివరకు 4,30,60,086 కరోనా కేసులు నమోదవగా.. 5,22,223 మంది కొవిడ్ తో మరణించారు. ఒక్కరోజు వ్యవధిలో కరోనా నుంచి మరో 1,862 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో 4,25,21,341 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

భారత్ లో 465 రోజులుగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 187.71 కోట్ల డోసుల టీకాలు అందజేశారు. నిన్న 3,64,210 డోసుల టీకాలు ఇచ్చారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 187,71,95,781 డోసుల టీకాలు అందజేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

Covid Effect On Shanghai : కరోనా ఎంత పని చేసింది.. ఎడారిని తలపిస్తున్న చైనాలోని అతిపెద్ద నగరం

భారత్ లో కరోనా నిర్ధారణ పరీక్షలు 83.50 కోట్లు దాటాయి. గడిచిన 24 గంటల్లో 3,02,115 టెస్టులు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 83,50,19,817 టెస్టులు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 3వేల 357 లాబ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. కరోనా టెస్టుల కోసం దేశవ్యాప్తంగా 1,431 ప్రభుత్వ లాబ్స్, 1,926 ప్రైవేట్ లాబ్స్ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.(Telangana Latest Corona News)

Food crisis in Shanghai: ఆహారం కోసం అలమటిస్తున్న చైనా వాసులు: లాక్ డౌన్ లోనే షాంఘై నగరం