Covid Effect On Shanghai : కరోనా ఎంత పని చేసింది.. ఎడారిని తలపిస్తున్న చైనాలోని అతిపెద్ద నగరం

చైనాలోని రెండో అతిపెద్ద నగరం షాంఘై. ఇప్పుడు కళ తప్పింది. పూర్తిగా మారిపోయింది. బోసిపోయి కనిపిస్తోంది. ఎడారి ప్రాంతాన్ని తలపిస్తోంది.(Covid Effect On Shanghai)

Covid Effect On Shanghai : కరోనా ఎంత పని చేసింది.. ఎడారిని తలపిస్తున్న చైనాలోని అతిపెద్ద నగరం

Covid Effect On Shanghai

Covid Effect On Shanghai : అదో అందమైన నగరం. ప్రపంచంలోని అతిపెద్ద మెట్రో పాలిటిన్ నగరాల్లో ఒకటి. నిత్యం రద్దీ రోడ్లు. పర్యాటకుల తాకిడితో కోలాహలంగా ఉండే నగరం. అదే చైనాలోని రెండో అతిపెద్ద నగరం షాంఘై. అలాంటి నగరం ఇప్పుడు కళ తప్పింది. పూర్తిగా మారిపోయింది. బోసిపోయి కనిపిస్తోంది. రోడ్లపై జనాలే కనిపించడం లేదు. రెండేళ్ల ముందుకు ఇప్పుడికి అసలే పోలీకే లేదు. రోడ్లపై ప్రభుత్వ వాహనాలు తప్ప మరొకటి కనిపించడం లేదు. మొత్తం నిర్మానుష్యంగా మారింది.

దీనికి కారణం కరోనానే. అవును, కరోనా కట్టడి చర్యల పేరుతో చైనా ప్రభుత్వం కఠిన నిర్ణయాలతో షాంఘై బోసిపోయింది. రోడ్లపై జన సంచారమే లేదు. కరోనా నిబంధనలతో షాంఘై పూర్తిగా బోసిపోయింది. కరోనా ఫస్ట్ వేవ్ నాటి పరిస్థితులను గుర్తు చేస్తోంది. షాంఘైలో జీరో కొవిడ్ పాలసీ చాలా కఠినంగా అమలు చేస్తున్నారు అధికారులు. షాంఘైలో 24 గంటల వ్యవధిలో 39 మంది కరోనాతో చనిపోవడం కలకలం రేపింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. షాంఘై నగరాన్ని ఆంక్షల వలయంలోకి నెట్టింది.(Covid Effect On Shanghai)

COVID-19: ఇండ్ల చుట్టూ ఫెన్సింగ్.. బిక్కుబిక్కుమంటున్న చైనా ప్రజలు

చైనాలో జనాభా పరంగా అతిపెద్ద నగరమైన షాంఘైలో జనాభా రెండు కోట్లపైనే ఉంటుంది. చైనాలోని మధ్య, తూర్పు తీరంలో యాంగ్జీ నది వద్ద అందమైన నగరం ఇది. ఫిషరీస్ తో పాటు టెక్స్ టైల్ రంగాల్లో చైనాకు షాంఘై నగరమే కీలకం. అయితే, కరోనా కేసులు పెరుగుదలతో ఇప్పుడు షాంఘై మారిపోయింది. ఏదో ఎడారి ప్రాంతంలా కనిపిస్తోంది. ప్రపంచ పర్యాటక నగరాల్లో ఒకటైన షాంఘైలోని అందాలు చూడాలంటే ఒకటి రెండు రోజులు ఏమాత్రం సరిపోవు. అంతలా పర్యాటక ఆకర్షణలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ.

Food crisis in Shanghai: ఆహారం కోసం అలమటిస్తున్న చైనా వాసులు: లాక్ డౌన్ లోనే షాంఘై నగరం

అయితే, పర్యాటకుల మాట అటుంచితే.. రోడ్లపైకి షాంఘై ప్రజలనే చైనా ప్రభుత్వం రానివ్వడం లేదు. షాంఘైలో కరోనా కేసులు పెరుగుతున్న మాట వాస్తవమే అయినా, ఇంతలా కట్టడి చేయాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు రోజురోజుకు క్రమంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో అధికారులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. సరికొత్త జీరో కొవిడ్ పాలసీని షాంఘైలో అమలు చేస్తోంది చైనా ప్రభుత్వం. నమోదవుతున్న కేసుల తీవ్రత, ప్రమాద తీవ్రత ఆధారంగా మూడు గ్రూపులుగా ప్రజలను విభజించారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంత ప్రజలు కఠినమైన కొవిడ్ ఆంక్షలను ఎదుర్కోక తప్పదు. కొంచెం తక్కువగా ఉన్న ఏరియా ప్రజలకు సాధారణ ఆంక్షలు పెట్టారు. ఇక జీరో కేసులు ఉన్న ఏరియా ప్రజలకు ఆంక్షలు వర్తించవు.(Covid Effect On Shanghai)

కాగా, కరోనా మహమ్మారి మరోమారు చైనాను వణికిస్తోంది. కోవిడ్ -19 మొదటి దశ కంటే.. ప్రస్తుతం చైనాలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. 2022 ఫిబ్రవరి చివరి వారంలో చైనాలో కరోనా ఫోర్త్ వేవ్ వ్యాప్తి మొదలవగా.. నేటికీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రధానంగా చైనా తూర్పు ప్రాంతంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇక చైనా ఆర్ధిక రాజధాని షాంఘైలో కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో సుమారు రెండున్నర కోట్ల మందికి పైగా జనాభా ఉన్న ఈ నగరంలో కఠిన లాక్ డౌన్ విధించారు అక్కడి అధికారులు. గత నెల రోజులుగా షాంఘై నగరంలో లాక్ డౌన్ కొనసాగుతూనే ఉంది. వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా షాంఘై నగరంలో మార్చి నెల నుంచి ఇప్పటి వరకు 3 లక్షల 90 వేల మంది మహమ్మారి బారిన పడ్డారు.