Telangana Corona Cases : తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకి కొత్త కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 38వేల 023 కరోనా శాంపిల్స్ పరీక్షించగా..

Telangana Corona Cases
Telangana Corona Cases : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకి కొత్త కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 38వేల 023 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 235 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 121 కొత్త కేసులు వెల్లడయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 31, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 23 కేసులు నమోదయ్యాయి.
అదే సమయంలో 204 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6లక్షల 81వేల 307కు చేరగా… 6,73,793 మంది కోలుకున్నారు. ఇంకా 3,490 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,024. అటు విదేశాల నుంచి వచ్చిన 346 మందికి టెస్టులు చేయగా, 10మందికి పాజిటివ్ రాగా, వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపారు.
తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 63కి చేరింది. 63మంది ఒమిక్రాన్ బాధితుల్లో 46 మంది టీకా తీసుకోలేదని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేని ముగ్గురికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ తర్వాత దేశంలో అత్యధిక ఒమిక్రాన్ కేసులు తెలంగాణలోనే రికార్డవుతుండడం టెన్షన్ పెడుతోంది.
ప్రపంచదేశాలను వణికిస్తోన్న ఒమిక్రాన్..భారత్ ను కూడా కలవర పెడుతోంది. దేశంలో ఒమిక్రాన్.. చాప కింద నీరులా వ్యాపిస్తోంది. భారత్ లో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 33 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్ లో కొత్తగా 23 ఒమిక్రాన్ కేసులు, ఏపీలో 10 ఒమిక్రాన్ కేసులను గుర్తించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 814కి పెరిగింది.
Scientists Warning: అంతరిక్షంలోకి మనుషులు వెళితే చంపుకుతినడం ఖాయం: శాస్త్రవేత్తలు
రాజస్థాన్ లో కొత్తగా 23 ఒమిక్రాన్ కేసులు గుర్తించారు. దీంతో ఆ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 69కి చేరింది. అలాగే ఏపీలో కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులను గుర్తించగా, ఏపీలో మొత్తం ఒమిక్రాన్ కేసులు 16కి చేరాయి.
భారత్ పై ఒమిక్రాన్ ప్రతాపం చూపిస్తోంది. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త వేరియంట్ వ్యాప్తి చెందింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 814 ఒమిక్రాన్ కేసులు నమోదవగా, 241 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 252 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క ముంబైలోనే 137 కేసులున్నాయి. 238 కేసులతో ఢిల్లీలో రెండో స్థానంలో ఉంది. అటు కేరళలో 57, తెలంగాణలో 63 వేరియంట్ కేసులు నమోదయ్యాయి. తొలుత సౌతాఫ్రికాలో నవంబర్ 24న వెలుగుచూసిన ఒమిక్రాన్.. ప్రపంచదేశాల్లో వేగంగా వ్యాపిస్తోంది.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.29.12.2021 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/jv6zBvepAw— IPRDepartment (@IPRTelangana) December 29, 2021