TG Cabinet meeting: జనవరి 4న తెలంగాణ క్యాబినెట్ సమావేశం
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ నివేదిక, ఎస్సీ వర్గీకరణ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డు పైన చర్చించే అవకాశం ఉంది.

తెలంగాణ క్యాబినెట్ జనవరి 4న సమావేశం కానుంది. ఆ రోజున సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరగనుంది.
కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, భూమిలేని నిరుపేదలకు సంవత్సరానికి రూ.12,000 సాయం, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ నివేదిక, ఎస్సీ వర్గీకరణ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డు పైన చర్చించే అవకాశం ఉంది. అలాగే, మరిన్ని అంశాలపై కూడా క్యాబినెట్‌లో చర్చించనున్నారు.
కాగా, కొన్ని వారాల క్రితం సమావేశమైన తెలంగాణ క్యాబినెట్.. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులు, ఇద్దరికి మించి పిల్లలు ఉన్నవారు కూడా పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసేందుకు అనుమతించేలా చట్టానికి సవరణలు వంటి అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. అలాగే, రైతు భరోసా విధి విధానాలు, యాదాద్రితో పాటు భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై కూడా చర్చించింది.
మాజీ మంత్రి కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ.. వాదనలు ఇలా జరిగాయి..