Bypoll Sentiment: 6సార్లు ప్రత్యేక ఉపఎన్నికలు.. ఐదుసార్లు అధికార పార్టీకే పట్టం.. తెలంగాణలో మరోసారి వర్కౌట్ కాని సెంటిమెంట్..
2016లో పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి మృతితో ఉపఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో రాంరెడ్డి వెంకట్ రెడ్డి సతీమణి సుచరిత పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
Bypoll Sentiment: ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తెలంగాణలో ఇప్పటివరకు ఆరుసార్లు ప్రత్యేక ఉపఎన్నికలు జరగ్గా.. ఐదుసార్లు సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. మరణించిన ఎమ్మెల్యే కుటుంబసభ్యులు ఒక్కసారి మాత్రమే గెలిచారు. ఐదుసార్లు అధికార పార్టీకే పట్టం కట్టిన ఓటర్లు.. ఒకసారి మాత్రం బీజేపీని గెలిపించారు. తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతపైన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. దాదాపు 25వేల ఓట్ల మెజారిటీతో విక్టరీ కొట్టారు.
ఇక ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇప్పటివరకు తెలంగాణలో జరిగిన ఎన్నికల విషయానికి వస్తే.. 2016లో పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి మృతితో ఉపఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో రాంరెడ్డి వెంకట్ రెడ్డి సతీమణి సుచరిత పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు 45వేల ఓట్ల తేడాతో సుచరితను ఓడించారు. 2016లో నారాయణఖేడ్ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మృతి చెందగా, ఆయన కుమారుడు సంజీవ రెడ్డి పోటీ చేశారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన భూపాల్ రెడ్డి 53వేల మెజార్టీతో సంజీవ రెడ్డిపై గెలుపొందారు.
2020లో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించగా, ఆయన సతీమణి సుజాత రెడ్డి ఉపఎన్నికలో బీఆర్ఎస్ తరపున బరిలో నిలిచారు. అయితే, అధికార పార్టీని కాదని బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు దుబ్బాక ఓటర్లు పట్టం కట్టారు. 2021లో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి చెందగా, ఉపఎన్నికలో ఆయన కుమారుడు భగత్ గెలుపొందారు. ఉపఎన్నికల్లో మరణించిన కుటుంబ సభ్యుల గెలుపు ఇదొక్కటే కావడం విశేషం.
2024లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందగా.. ఆమె సోదరి నివేదిత బీఆర్ఎస్ తరపున బరిలోకి దిగారు. నివేదితపై కాంగ్రెస్ అభ్యర్థి అభ్యర్థి శ్రీ గణేష్ విజయం సాధించారు. ఇక, తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పై నవీన్ యాదవ్ విజయం సాధించారు. దీంతో మరోసారి సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు.
