Heavy Rains In Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు
తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

heavy rains
Heavy Rains In Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 12 వరకు తేలికపాటి జల్లులు పడతాయని చెప్పింది.
ఈనె 13న పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని వెల్లడించింది. ఈ మేరకు వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. తూర్పు దిశ నుంచి తెలంగాణ వైపు
గాలులు వీస్తున్నాయని తెలిపింది.
Mandous Cyclone : వాయుగుండంగా మారిన మాండూస్ తుపాను.. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరిలో వర్షాలు
రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా చలి ప్రభావం అధికంగా ఉంటుందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదలి తుపానుగా మారిందని వెల్లడించింది. ఈ గాలులకు తుపాను తోడవ్వడంతో చలి తీవ్రత ఎక్కువ అవుతుందని వివరించింది.