Special Trains : కాచిగూడ-తిరుపతి మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లు

ఇప్పుడు మరో నాలుగు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అలాగే, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్- కలబుర్గి మధ్య ప్రత్యేక రైళ్లు, హైదరాబాద్- కలబుర్గి-హైదరాబాద్ సెంట్రల్, సౌత్ సెంట్రల్ ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు.

Special Trains : కాచిగూడ-తిరుపతి మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లు

Trains

Updated On : June 15, 2022 / 9:20 PM IST

special trains : తిరుమల శ్రీవారి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఎస్ సీఆర్ ప్రకటించింది. బుధవారం నుంచి 18వ తేదీ వరకు కాచిగూడ-తిరుపతి మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు పేర్కొంది.

రైలు నంబర్‌ 07597 కాచిగూడ స్పెషల్ జూన్ 15, 17 తేదీల్లో కాచిగూడలో రాత్రి 7 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. మరో రైలు నంబర్‌ 07598 తిరుపతి-కాచిగూడ స్పెషల్ జూన్ 16, 18 తేదీల్లో తిరుపతిలో ఉదయం 10.10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు రాత్రి 9.55 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.

Special trains: శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఊరట.. తిరుమలకు 20 ప్రత్యేక రైళ్లు..

ఈ ప్రత్యేక రైళ్లు మల్కాజిగిరి, నల్లగొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్ ఏసీ, ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ ఉన్నాయి. తిరుమల శ్రీవారిని దర్శించుకుని హైదరాబాద్‌కు తిరిగి వచ్చే భక్తుల సౌకర్యార్థం రైల్వే శాఖ ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.