Theenmar Mallanna : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో బీఆర్ఎస్ గట్టేక్కే పరిస్థితి లేదు : తీన్మార్ మల్లన్న కామెంట్స్!

Theenmar mallanna : ప్రజాస్వామ్యంలో యుద్ధం చేయలేకనే మల్లన్నకు అధికారులు సహకరిస్తున్నారని అసత్య ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు.

Theenmar Mallanna : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో బీఆర్ఎస్ గట్టేక్కే పరిస్థితి లేదు : తీన్మార్ మల్లన్న కామెంట్స్!

theenmar mallanna enugula rakesh reddy

Updated On : June 6, 2024 / 9:40 PM IST

Theenmar Mallanna : పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గట్టేక్కే పరిస్థితి లేదని, అందుకే అధికారులపై ఆ పార్టీ నిరాదారణమైన ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విమర్శించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ కోట్ల రూపాయలతో బోగస్ ఓట్లతో పాటు అన్ని ప్రయత్నాలు చేసినా విఫలమయ్యాయని విమర్శలు గుప్పించారు.

Read Also : చంద్రబాబు క్యాబినెట్‌లో ఉండేదెవరు? పవన్, లోకేశ్‌లకు దక్కే మినిస్ట్రీ ఏది? జిల్లాల వారీగా వివరాలు..

ప్రజాస్వామ్యంలో యుద్ధం చేయలేకనే మల్లన్నకు అధికారులు సహకరిస్తున్నారని అసత్య ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఓటమిని స్వీకరించలేకనే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఫలితం వెలువడేంత వరకు ఇక్కడే ఉండాలని, కేటీఆర్ డైరెక్షన్‌లో మళ్లీ ప్లాన్ చేయబోతున్నారని తీన్మార్ మల్లన్న ఆరోపించారు.

నా గెలుపును అడ్డుకునే కుట్ర : ఏనుగుల రాకేష్ రెడ్డి
కౌంటింగ్ కేంద్రం వద్ద తీన్మార్ మల్లన్న చేసిన ఆరోపణలను  బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. కౌంటింగ్ ప్రక్రియలో అవకతవకలు, గోల్‌మాల్ జరుగుతుందని ఆయన విమర్శించారు. అభ్యంతరం చెప్పినా అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రాకేష్ రెడ్డి విమర్శించారు. అధికారుల చర్యలు దుర్మార్గం, దురదృష్టకరమన్నారు. రిటర్నింగ్ అధికారిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

అధికారుల తీరు ఫలితాలు తారుమారు చేసేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మా అభ్యంతరాన్ని స్వీకరించిన తర్వాతే కౌంటింగ్ జరపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. నా గెలుపును అడ్డుకునే కుట్ర జరుగుతోందని విమర్శించారు. పారదర్శంగా జరిగే కౌంటింగ్ ప్రక్రియను తాము స్వాగతిస్తామని, తమ అభ్యంతరాలను వివరణ ఇచ్చాకే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరగాలని రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు.

Read Also : Chandrababu Naidu : అధికారం చేపట్టకముందే అడ్మినిస్ట్రేషన్‌పై పట్టు సాధిస్తోన్న బాబు..