Dead Bodies: దేవరకద్ర గుట్టపై మూడు మృతదేహాలు కలకలం

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలోని ఓ గుట్టపై మూడు మృతదేహాలు పడి ఉండటం కలకలం రేపుతోంది. పశువుల కాపరులకు మృతదేహాలు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Dead Bodies: దేవరకద్ర గుట్టపై మూడు మృతదేహాలు కలకలం

Dead Bodies

Updated On : May 27, 2021 / 1:48 PM IST

Dead Bodies: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలోని ఓ గుట్టపై మూడు మృతదేహాలు పడి ఉండటం కలకలం రేపుతోంది. పశువుల కాపరులకు మృతదేహాలు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. విచారణలో మృతులు తల్లీ, ఓ కుమారుడు, కూతురుగా తేలింది. మృతులది దేవరకద్రగా పోలీసులు గుర్తించారు. సోమవారం ఇంట్లోంచి వెళ్ళిపోయినట్లుగా వారి ఇంటి చుట్టుపక్కల వారు పోలీసులకు తెలిపారు. గుడికి వెళ్తామని తమతో చెప్పారని ఆ తర్వాత తిరిగి ఇంటికి రాలేదని స్థానికులు పోలీసులకు తెలిపారు. కాగా ఇది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.