Mahesh Kumar Goud : కారు దిగేందుకు మరికొందరు రెడీ? బీఆర్ఎస్‌లో కలకలం రేపిన పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు..
ఎవరెవరు కండువా మార్చేందుకు రెడీగా ఉన్నారనే ఉత్కంఠను రేపుతోంది.

Mahesh Kumar Goud
Mahesh Kumar Goud : తెలంగాణ కాంగ్రెస్ లోకి వలసలు కంటిన్యూ అవుతాయా? కారు దిగేందుకు మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారా? పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటి? కాంగ్రెస్ తో బీఆర్ఎస్ నేతలు నిజంగానే టచ్ లో ఉన్నారా? మొత్తానికి ఇప్పుడు పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు గులాబీ నేతల్లో గుబులు రేపాయి.
కొంతమంది బీఆర్ఎస్ నేతలు తమతో టచ్ లో ఉన్నారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. వారంతా శుభ ముహూర్తం చూసుకుని కండువా మార్చేస్తారని చెప్పుకొచ్చారు. నిన్న ఆదిలాబాద్ కు చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, బీజేపీ మాజీ ఎంపీ సోయం బాపూరావు కాంగ్రెస్ లో చేరిపోయారు. ఈ క్రమంలో పీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఎవరెవరు కండువా మార్చేందుకు రెడీగా ఉన్నారనే ఉత్కంఠను రేపుతోంది. పార్టీకి ఎవరు దూరంగా ఉంటున్నారు, ఎవరు అసంతృప్తిగా ఉంటున్నారు అనే చర్చ మొదలైంది.
‘వారంతా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నమ్మి వస్తున్నారు. బేషరతుగా పార్టీలో చేరుతున్నారు. ఏదీ ఆశించి చేరడం లేదు. కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్ లో ఉన్నారు. శుభ ముహూర్తం చూసుకుని వారంతా మా పార్టీలో జాయిన్ అవుతారు’ అని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
Also Read : గులాబీ దళపతి రాకకు సమయం ఆసన్నమైందా?