Revanth Criticized BRS Govt : బీఆర్ఎస్ పాలనలో పేదోడి బిడ్డను కుక్కలు చంపితే సాయం చేసే మానవత్వం లేదా? : రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ పాలనలో పేదోడి బిడ్డను కుక్కలు చంపితే సాయం చేసే మానవత్వం లేదా అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రాంతం ఆడపడుచుల చైతన్యానికి ప్రతీక.. అలాంటి ఈ ప్రాంతంలో ఆడబిడ్డలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందని చెప్పారు.

Revanth Criticized BRS Govt : బీఆర్ఎస్ పాలనలో పేదోడి బిడ్డను కుక్కలు చంపితే సాయం చేసే మానవత్వం లేదా? : రేవంత్ రెడ్డి

Revanth

Updated On : February 23, 2023 / 12:11 AM IST

Revanth Criticized BRS Govt : బీఆర్ఎస్ పాలనలో పేదోడి బిడ్డను కుక్కలు చంపితే సాయం చేసే మానవత్వం లేదా అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రాంతం ఆడపడుచుల చైతన్యానికి ప్రతీక.. అలాంటి ఈ ప్రాంతంలో ఆడబిడ్డలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందని చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి బస్టాండ్ సెంటర్ లోని స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ వచ్చాక మనవడికి ఉద్యోగం రాలేదు కానీ.. మందు అలవాటైందని ఓ పెద్దవ్వ చెప్పిందని ఎద్దేవా చేశారు.

ఎవరిని కదిలించినా ఎక్కడ చూసినా దుఃఖమే కనిపిస్తుందని చెప్పారు. పేదల భూములు కబ్జాలు చేసి.. ఈ ఎమ్మెల్యే పామాయిల్ ఫ్యాక్టరీ పెట్టుకుంటుండటన్నారు. అబద్దాల హామీలు ఇచ్చిన కేసీఆర్ పేదలకు చేసిందేం లేదని విమర్శించారు. వారి ఆస్తులు పెంచుకున్నారు.. తప్ప.. తెలంగాణకు చేసిందేం లేదన్నారు. కేసీఆర్ సీఎం కావాలని, కుటుంబ సభ్యులు, బంధువులు మంత్రులు కావాలని ఏ నక్సలైట్ల ఎజెండాలో ఉందన్నారు.

Revanth Reddy : ఇళ్లు లేని వారికి రూ.5లక్షలు, రుణమాఫీ రూ.2లక్షలు, రూ.500లకే గ్యాస్ బండ-రేవంత్ రెడ్డి హామీ

పోడు భూములపై ప్రశ్నించిన గిరిజనులను చెట్టుకు కట్టేసి కొట్టిన పరిస్థితి ఉందని తెలిపారు. రోడ్డుపై చిన్నారిని కుక్కలు కరిచి చనిపోతే మంత్రి కేటీఆర్ సారీ చెప్పి చేతులు దులుపుకున్నారని పేర్కొన్నారు. పేదోడి కడుపుకోత నీకు తెలుసా కేటీఆర్ అని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో పేదోడి బిడ్డను కుక్కలు చంపితే సాయం చేసే మానవత్వం లేదా? ఫైర్ అయ్యారు. కనీస మానవత్వం లేని మీరు మనుషులా రాక్షసులా? మండిపడ్డారు.

కాంగ్రెస్ ఏం చేసిందంటున్న ఎమ్మెల్యేకు భూపాలపల్లిలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కార్యకర్తల ఉసురు తగిలి నాశనమై పోతారని శాపనార్థం పెట్టారు. రాజీవ్ విగ్రహం సాక్షిగా డ్రామారావుకు సవాల్ విసురుతున్నానని చెప్పారు. నీ ఎమ్మెల్యే ఆక్రమించున్న భూములపై విచారణకు సిద్ధమా? అని సవాల్ చేశారు. మీ ఎమ్మెల్యే అక్రమ ఆస్తులపై విచారణకు సిద్ధమా అని అన్నారు.

Revanth Reddy : రాష్ట్రంలో సమస్యలన్నీ తీరాలంటే.. కేసీఆర్ పోవాలి కాంగ్రెస్ రావాలి-రేవంత్ రెడ్డి

సింగరేణి నిధుల దోపిడీపై విచారణకు సిద్ధమా? ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి అవినీతిపై చర్చకు మేం రెడీ అని అన్నారు. బహిరంగ చర్చకు డ్రామారావు సిద్ధమా? అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పోవాలి… ఇందిరమ్మ రాజ్యం రావాలి అని కాంక్షించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇళ్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5లక్షలు అందిస్తామని చెప్పారు.

రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసే బాధ్యత తమదన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.5లక్షల వరకు వైద్యం ఖర్చు కాంగ్రెస్ ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డల కష్టాలు తీరుస్తామని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంతోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయని స్పష్టం చేశారు.