TRS and BJP : టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం
8 ఏళ్ల క్రితమే ప్రధాని మోదీ రాష్ట్ర విభజనపై అడ్డంగా మాట్లాడారన్న కేటీఆర్.. పార్లమెంట్‌లో ప్రధాని అసందర్భంగా విభజన ప్రస్తావన తెచ్చారని మండిపడ్డారు.

Trs Bjp
TRS and BJP leaders : తెలంగాణలో కొన్ని రోజులుగా పొలిటికల్ హీట్ ముదురుతోంది. పార్టీల మధ్య మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య పీక్స్‌కు చేరింది. తాజాగా ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ ఫైర్ అవుతూనే.. ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. విభజనపై ప్రధాని మోదీ వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
8 ఏళ్ల క్రితమే ప్రధాని మోదీ రాష్ట్ర విభజనపై అడ్డంగా మాట్లాడారన్న కేటీఆర్.. పార్లమెంట్‌లో ప్రధాని అసందర్భంగా విభజన ప్రస్తావన తెచ్చారని మండిపడ్డారు. అరపైసా సాయం చేయకుండా.. తెలంగాణ పుట్టుకనే ప్రశ్నిస్తున్నారని ఆరోపించారు కేటీఆర్. అటు.. రేవంత్, బండి సంజయ్‌పైనా ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు తెలంగాణ ఐటీ మంత్రి. మరోవైపు బండి సంజయ్ వేములవాడ కోసం కనీసం నిధులు తీసుకురాలేదని…గెలిచి మూడేళ్లైనా ఏమీ చేయలేదని విమర్శించారు.
KTR : కేసీఆర్‌ను ఒక్కమాట అన్నా ఫిరంగులై గర్జిద్దాం- బీజేపీపై కేటీఆర్ ఫైర్
మరోవైపు సీఎం కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. మేడారం జాతరకు సీఎం కేసీఆర్ ఎందుకు రాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు తిరగబడతారన్న ఉద్దేశంతోనే సీఎం మేడారం జాతరకు రాలేదని ఆరోపించారు. గిరిజనులు, హిందువులకు సీఎం క్షమాపణ చెప్పాలన్నారు బండి సంజయ్. ఇలా రోజురోజుకి ఇరు పార్టీల మధ్య వార్ హీట్ పెంచుతోంది.