TRS Plenary : ఫ్లెక్సీల ఏర్పాటుపై జరిమానాలు విధించిన జీహెచ్ఎంసీ

టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భగా నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై జీహెచ్ఎంసీ కొరడా ఝులిపిస్తోంది. ఏర్పాటు చేసిన ఫెక్సీలపై భారీగా జరిమానాలు విధిస్తోంది.

TRS Plenary : ఫ్లెక్సీల ఏర్పాటుపై జరిమానాలు విధించిన జీహెచ్ఎంసీ

Ghmc

Updated On : October 28, 2021 / 8:16 PM IST

GHMC Fines Installing Flexis : టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భగా నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై జీహెచ్ఎంసీ కొరడా ఝులిపిస్తోంది. నేతల పేరిట ఏర్పాటు చేసిన ఫెక్సీలపై భారీగా జరిమానాలు విధిస్తోంది. ఇటీవలే టీఆర్ఎస్ ప్లీనరీని పార్టీ ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. పార్టీ ఏర్పాటు అయి…20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా…దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తూ…అత్యంత గ్రాండ్ గా నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురు నేతలు నగరంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Read More : Kim Jong Un : నో బాడీ డబుల్..20 కిలోల బరువు తగ్గిన కిమ్

స్వాగతం..సుస్వాగతం అంటూ..నేతల ఫొటోలు ఏర్పాటు చేసి నగరంలోన పలు కూడళ్లలో ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలపై తీవ్ర విమర్శలు ఎక్కువయ్యాయి. సిటీలో ఎక్కడపడితే..అక్కడ భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ప్రతిపక్ష పార్టీలు, ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. తాజాగా…2021, అక్టోబర్ 28వ తేదీ గురువారం జీహెచ్ఎంసీ ఫైన్లు విధించింది. ఇందులో ఎమ్మెల్యే దానం నాగేందర్ కు అధికంగా ఫైన్ పడింది.

Read More : HYD : లైవ్ వీడియోతో మాజీ మిస్ తెలంగాణ ఆత్మహత్యాయత్నం

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు రూ. లక్షా 5 వేలు, మంత్రి మల్లారెడ్డికి రూ. 10 వేలు, ఎమ్మెల్యే దానం నాగేందర్ కు రూ. 2 లక్షల 35 వేల మేయర్ గద్వాల్ విజయలక్ష్మీకి రూ. 25 వేలు, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కు రూ. 2 లక్షలు, టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ పేరిట రూ. 95 వేల జరిమాన విధించింది జీహెచ్ఎంసీ. జీహెచ్ఎంసీ సర్వర్ పని చేయకపోవడంతో జరిమాన విషయంలో ఆలస్యమైంది. సర్వర్ అప్ గ్రేడ్ అవడంతో జరిమానాలను విధిస్తూ వస్తోంది జీహెచ్ఎంసీ.