Nagarkurnool : ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురికి తీవ్ర గాయాలు
నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉప్పునూతల మండలం వెల్టూర్ గేట్ వద్ద ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢికొన్నాయి

West Bengal Accident
Nagarkurnool : నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉప్పునూతల మండలం వెల్టూర్ గేట్ వద్ద ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢికొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీశైలం – హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరగడంతో ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడింది.
చదవండి : West Bengal Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ప్రమాదానికి గురైన కార్లను పక్కకు తీసి ట్రాఫిక్ క్లియర్ చేశారు. కాగా గాయపడిన వారిలో ఇద్దరిపరిస్థితి విషమంగా ఉండటంతో వారిని హైదరాబాద్ తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
చదవండి : West Bengal Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి