Minister Amit Shah : దేశ ప్రతిష్టలు కాపాడటంలో పోలీస్ వ్యవస్థ చాలా కీలకం,దేశ అత్యున్నతి కోసం ఐపీఎస్‌లు పాటుపడాలి : అమిత్ షా

నేషనల్ పోలీస్ అకాడమీలో జరుగుతున్న IPS పాసింగ్ ఔట్ పరేడ్ కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులు అర్పించారు.

Minister Amit Shah : దేశ ప్రతిష్టలు కాపాడటంలో పోలీస్ వ్యవస్థ చాలా కీలకం,దేశ అత్యున్నతి కోసం ఐపీఎస్‌లు పాటుపడాలి : అమిత్ షా

Union Home Minister Amit Shah

Updated On : October 27, 2023 / 9:59 AM IST

Union Home Minister Amit Shah in IPS Passing Out Parade : హైదరాబాద్ లోని నేషనల్ పోలీస్ అకాడమీలో జరుగుతున్న IPS పాసింగ్ ఔట్ పరేడ్ కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అకాడమీలో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులు అర్పించారు.అనంతరం 175 మంది IPS అధికారుల గౌరవ వందనం స్వీకరించారు.

ఆ తరువాత ఆయన ప్రసంగిస్తు..దేశ ప్రతిష్టలు కాపాడంలో పోలీస్ వ్యవస్థ రోల్ చాలా కీలకం అని అన్నారు. దేశ అత్యున్నతీ కోసం ఐపిఎస్ లు పాటుపడాలని..దేశానికి సేవలు అందించడంలో ఐపిఎస్ లు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. బాధిత ప్రజలకు అండగా ఉండేలా వారి సేవలు ఉండాలన్నారు. బాధితుల భద్రత కోసం ఐపిఎస్ లు నిబద్దతతో కృషి చేయాలన్నారు. 75వ బ్యాచ్ ఐపిఎస్ శిక్షణలో 33మంది మహిళా ఐపిఎస్ లు ఉండడం సంతోషం, గర్వకారణంమని అన్నారు.

ఈ సందర్భంగా దేశంలో సైబర్ నేరాల విషయాన్ని ప్రస్తావిస్తు.. సైబర్ నేరాల అదుపు, నేరగాళ్లకు చెక్ పెట్టడంలోనూ టెక్నాలజీపై ఐపిఎస్ లు దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. నక్సలిజం, టేర్రరిజాన్ని రూపుమాపేలా కృషి చేయాలన్నారు. ఇటువంటి అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపాలన్నారు.భవిష్యత్ లో ఎదురయ్యే ఎన్నో సవాళ్ళను ఐపిఎస్ లు అలవోకగా ఎదురుకోవాలని సూచించారు.

అర్గనేనింగ్ క్రైమ్, సైబర్ క్రైమ్ క్రిప్తో కరెన్సీ, హవాలా మనీ, నకిలీ నోట్ల చలామణి, గ్రేహౌండ్, నార్కోటిక్స్, ఇంటర్ స్టేట్ గ్యాంగ్, చార్జిషీట్ ఫైల్, ఫోరెన్సిక్ సైన్స్ అన్ని అంశాలపై ఐపిఎస్ లు పట్టు సాధించాలని..న్యాయ వ్యవస్థలో వస్తున్న మార్పులు అనుగుణంగా క్రిమినల్ జస్టిస్ పై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. అంతిమంగా ఐపిఎస్ లు ప్రజలకు భద్రత అందించడంలో వారి మనసులు గెలవాలే పనిచేయాలని సూచించారు.

IPS పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమానికి తెలంగాన గవర్నర్ తమిళ సై, తెలంగాణ డిజిపి అంజనీ కుమార్ తో పాటు పలువురు IPS లు IAS లు, ఇప్పటికే ట్రైనింగ్ పూర్తి చేసుకున్న IPS కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.