Bandi sanjay: ఆ మాత్రం తేడా తెలియదా..! అసదుద్దీన్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్..

టీటీడీని వక్ఫ్ ఆస్తులతో పోల్చడం అజ్ఞానాన్ని, అవగాహనా రాహిత్యాన్ని తెలియజేస్తోందని బండి సంజయ్ అన్నారు.

Bandi sanjay: ఆ మాత్రం తేడా తెలియదా..! అసదుద్దీన్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్..

Bandi Sanjay Kumar and Asaduddin Owaisi

Updated On : November 3, 2024 / 9:07 AM IST

Asaduddin Owaisi : వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లింలను సభ్యులుగా చేర్చాలని మోదీ సర్కార్ బిల్లు తెచ్చిందని.. టీటీడీలో మాత్రం అందరూ హిందువులే ఉండాలని అంటున్నారని ఒవైసీ అన్నారు. హిందువులకు టీటీడీ పవిత్రమైనప్పుడు, ముస్లింలకు వక్ఫ్ బోర్డు కూడా అంతే పవిత్రమైందన్నారు. అలాంటి చోట ఇతరులను ఎలా అనుమతిస్తారని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. అసదుద్దీన్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. పవిత్రమైన తిరుమల ఆలయానికి, వక్ఫ్ బోర్డు భూములకు ఒవైసీకి తేడా తెలియదన్నారు.

Also Read: పాణ్యంలో రెచ్చిపోయిన మైనింగ్ మాఫియా.. టీడీపీ నేతపై హత్యాయత్నం..

టీటీడీని వక్ఫ్ ఆస్తులతో పోల్చడం అజ్ఞానాన్ని, అవగాహనా రాహిత్యాన్ని తెలియజేస్తోందని సంజయ్ అన్నారు. వక్ఫ్ ఆస్తులు పేద ముస్లిం సమాజానికి ఉపయోగపడాలి.. తప్ప వ్యక్తిగత ప్రయోజనాలకు కాదు. మతం వ్యాపారంకోసం వాడుకొనే సాధనం కాదు. కానీ, ఒవైసీ దానిని ఆ విధంగా చూస్తున్నట్లు కనిపిస్తోంది. పాతబస్తీ వాసులు మేల్కొని ఏఐఎంఐఎంకు దశాబ్దాలుగా మద్దతు ఇస్తున్నా తమ ప్రాంతం ఎందుకు అభివృద్ధి చెందలేదని ప్రశ్నించాలని బండి సంజయ్ కోరారు. ఏఐఎంఐఎంకి స్థిరమైన ఓటింగ్ ఉన్నప్పటికీ, పాత నగరం అభివృద్ధి చెందలేదు, మెట్రో వంటి అవసరమైన మౌలిక సదుపాయాలు లేవు.

Also Read: టీటీడీపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..

ఒవైసీ కుటుంబం సేవ ముసుగులో వక్ఫ్ భూములను దోపిడీ చేసి కాలేజీలు, ఆసుపత్రులు నిర్మించి సంపదను కూడబెట్టుకుంది. బీఆర్ఎస్, ఏఐఎంఐఎంతో పొత్తు పెట్టుకుంది, అయితే ఈ రాజకీయ సంబంధాలను బహిర్గతం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్‌తో పొత్తుకు ఎంఐఎం చేస్తున్న ప్రయత్నాలు దాని నిజమైన రాజకీయ ఉద్దేశాలను వెల్లడిస్తున్నాయి. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఏఐఎంఐఎం కార్యకర్తలు తమ నాయకుల అవకాశవాద రాజకీయాలకు తమ జీవితాలను త్యాగం చేయడంపై పునరాలోచించాలని బండి సంజయ అన్నారు.