తెలంగాణలో Unlock-5 గైడ్ లైన్స్ ఇవే.. ఆ జోన్లలో కఠినంగా లాక్‌డౌన్!

unlock
Unlock-5 Guidelines : తెలంగాణ రాష్ట్రంలోని కంటైన్మెంట్ జోన్లలో అక్టోబరు 31వ తేదీ వరకు కఠినంగా లాక్‌డౌన్ అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు బుధవారం (అక్టోబర్ 7, 2020) Unlock-5 మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. కాలేజీలు, ఉన్నత విద్య సంస్థలు ఈ నెల 31 వరకు ఆన్‌లైన్ తరగతులను కొనసాగించాలని ప్రభుత్వం తాజా మార్గదర్శకాల్లో వెల్లడించింది.
రాష్ట్రంలోని పలు పాఠశాలలు, కోచింగ్ సెంటర్లు, వినోదాత్మక పార్కులు, సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సుల పునఃప్రారంభంపై కూడా ప్రత్యేక ఆదేశాలు జారీ చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
ఈ నెల 15 నుంచి డి స్కాలర్, ల్యాబ్ పీజీ కోర్సులను అందిస్తున్న ఉన్నత విద్యా సంస్థలు తెరుచుకోవచ్చు. అలాగే క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు ఈ నెల 15 నుంచి స్మిమ్మింగ్ ఫూల్స్ తెరిచేందుకు అనుమతినిచ్చింది. కాకపోతే కోవిడ్ నిబంధనల ప్రకారమే ఈ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించుకోవాలని సూచించింది.
టూ బీ ఎగ్జిబిషన్లు కూడా ప్రారంభించేందుకు అనుమతులు జారీ చేసింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల 100 మంది గ్రూపులతో కూడిన కార్యక్రమాలకు అనుమతినిచ్చింది. మాస్కులు, థర్మల్ స్క్రీనింగ్, భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఇక పెళ్లి, అంత్యక్రియల వంటి కార్యక్రమాలకు 100 మందికి మించి హాజరుకాకూడదని తెలిపింది.
అంతకుమించి హాజరయ్యే పక్షంలో జిల్లా కలెక్టర్, స్థానిక పోలీసులు, జిల్లా ఆరోగ్య శాఖ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని మార్గదర్శకాల్లో సూచించింది. పదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లు దాటిన వృద్ధులు, గర్భిణులు, అనారోగ్య సమస్యలున్న వారు ఎవరైనా సరే ఇళ్లలోనే ఉండాలని బయటకు రావొద్దని సూచించింది.