Veera Raghava Reddy : యువకులతో ఘర్షణ.. బాధితుడి ఫిర్యాదు.. మరోసారి వీర రాఘవ రెడ్డి అరెస్ట్..!

Veera Raghava Reddy : వీర రాఘవ రెడ్డిని మరోసారి మొయినా బాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. యువకులతో ఘర్షణకు సంబంధించి ఫిర్యాదుతో అదుపులో తీసుకున్నారు.

Veera Raghava Reddy : యువకులతో ఘర్షణ.. బాధితుడి ఫిర్యాదు.. మరోసారి వీర రాఘవ రెడ్డి అరెస్ట్..!

Veera Raghava Reddy

Updated On : June 2, 2025 / 11:49 PM IST

Veera Raghava Reddy : వీర రాఘవ రెడ్డిని మరోసారి మొయినా బాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మే 1న వీర రాఘవరెడ్డికి పలువురు యువకులకు మధ్య ఘర్షణ జరిగింది.

Read Also :  Google Pixel 9 Pro XL : పిక్సెల్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈ పిక్సెల్ ఫోన్ ఇంత తక్కువ ధరకు మళ్లీ జన్మలో రాదు.. వదులుకోవద్దు భయ్యా..!

ఆ రోజు జరిగిన గొడవలో వీర రాఘవ రెడ్డి యువకులపై దాడి చేశాడు. ఈ ఘర్షణలో రాజు అనే యువకుడి చెయ్యి విరిగింది. బాధితుడు రాజు మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దాంతో మొయినాబాద్ పోలీసులు వీర రాఘవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో చిలుకూరు బాలాజీ అర్చకులు రంగరాజన్‌పై దాడి కేసులో కూడా వీర రాఘవరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

ఆ కేసులో వీర రాఘవరెడ్డి బెయిల్‌పై బయటే ఉన్నాడు. ఇప్పుడు మరోసారి దాడికి పాల్పడటంతో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొవ్వూరి వీర రాఘవరెడ్డి ‘రామరాజ్యం’ పేరుతో ప్రైవేట్ సైన్యాన్ని నడుపుతున్నాడు. రామరాజ్యం స్థాపించాలనే లక్ష్యంతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు. పదో తరగతి పూర్తి అయిన యువకులను సైన్యంలోకి చేర్చుకుంటున్నాడు.

Read Also : Moto G85 5G : అతి చౌకైన ధరకే మోటో G85 5G ఫోన్.. టాప్ ఫీచర్లు అదుర్స్.. కొంటే ఇప్పుడే కొనేసుకోండి!

యువతను సైన్యంలో చేర్చుకుని వీర రాఘవరెడ్డి దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. చిలుకూరు బాలాజీ అర్చకుడు రంగరాజన్‌ను కూడా రామరాజ్యం సైన్యంలో చేరాలని ఒత్తిడి చేశాడు. కానీ, రంగరాజన్ అందుకు నిరాకరించారు. ప్రైవేట్ సైన్యంతో అర్చకుడి ఇంటిపై దాడికి పాల్పడ్డాడు.