Vemulawada : భక్తుల మాదిరిగా వెళ్లిన వేములవాడ ఈవో.. పార్కింగ్ కాంట్రాక్టర్‌‌పై ఆగ్రహం

వారి దగ్గర ఉన్న రశీదు బుక్కులను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 20కిపైగా బుక్కులను స్వాధీనం చేసుకున్నారు. పార్కింగ్‌ టెండర్‌ రద్దు చేశారు..

Vemulawada : భక్తుల మాదిరిగా వెళ్లిన వేములవాడ ఈవో.. పార్కింగ్ కాంట్రాక్టర్‌‌పై ఆగ్రహం

Vemulawada

Updated On : February 4, 2022 / 1:05 PM IST

Vemulawada Temple EO : వేములవాడ రాజన్న ఆలయ ఈవో మారువేషంలో వెళ్లి… అక్రమ పార్కింగ్‌ వసూళ్ల గుట్టు రట్టు చేశారు. ఆలయంలో పార్కింగ్‌ టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌.. అధికారులు నిర్ణయించిన ధరలకంటే అదనంగా వసూలు చేస్తున్నారు. దీనిపై ఆలయ అధికారులకు భక్తులు నుంచి ఫిర్యాదులు అందాయి. రెండు వారాల క్రితం ఆలయానికి రమాదేవి ఈవోగా వచ్చారు. రాగానే పార్కింగ్‌ అక్రమ వసూళ్ల సంగతేంటో తేల్చాలని డిసైడ్‌ అయ్యారు. అందుకో ఓ ప్లాన్‌ వేశారు. పార్కింగ్‌ కాంట్రాక్టర్‌ అక్రమాలను బయటపెట్టేందుకు ఆమె సాధారణ భక్తుల తరహాలో కారులో వెళ్లారు. టీటీడీ వసతి గదుల సముదాయంలోకి వెళ్లారు. కారు పార్కింగ్‌ ఎంతని అడుగగా 80 రూపాయలంటూ అక్కడి సిబ్బంది తెలిపారు. దీంతో 80 రూపాయలు కారు పార్కింగ్‌ కోసం చెల్లించారు. అందుకు రశీదు కూడా ఇచ్చారు పార్కింగ్‌ కాంట్రాక్టర్‌ సిబ్బంది.

Read More : Allu Arjun : ‘పుష్ప’ 50 రోజులు.. 365 కోట్ల కలెక్షన్స్.. తగ్గేదేలే..

80 రూపాయలు పార్కింగ్‌ ఫీజు చెల్లించినట్టు రశీదు ఇవ్వడంతో ఈవో రమాదేవి ఒక్కసారిగా శివంగిలా మారారు. పార్కింగ్‌ కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 రూపాయలకు బదులు 80 రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు. తాను ఆలయ ఈవోనని.. చెప్పడంతో అక్కడి సిబ్బంది నీళ్లు నమిలారు. ఏం చేయాలో తెలియక తికమక పడ్డారు. తమదేమీ లేదని…అంతా కాంట్రాక్టర్‌ చెప్పినట్టుగానే వసూలు చేస్తున్నామని తెలిపారు. దీంతో కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈవో రమాదేవి. వాస్తవానికి కారుకు 50రూపాయలే వసూలు చేయాలి.. కానీ పార్కింగ్‌ కాంట్రాక్టర్‌ మాత్రం 80 రూపాయలు వసూలు చేస్తున్నారు. పార్కింగ్‌ రిసిప్ట్‌పై ఎలాంటి రుసుము లేకుండా ప్రింట్‌ చేయించారు. ఆలయ అధికారులు పార్కింగ్‌ ఫీజుతో ప్రింట్‌ చేసిన రశీదు పుస్తకాన్ని పక్కన పడేశారు. సొంతంగా ప్రింట్‌ చేయించుకుని ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు.

Read More : Statue of Equality : సమతామూర్తి ప్రాంగణం.. భక్తి పారవశ్యంలో శ్రీరామనగరం, వైనతేయేష్టి అంటే ఎమిటి

ఫోర్‌ వీలర్స్‌కు 80రూపాయలు రాసి భక్తుల నుంచి వసూలు చేస్తున్నారు. అంటే ఒక్కో కారుపై 30రూపాయలు భక్తుల నుంచి దండుకుంటున్నారు. భారీ వాహనాలకు 100 రూపాయలు వసూలు చేయాల్సి ఉండగా… 150 వసూలు చేస్తున్నారు. టూ వీలర్‌, త్రీ వీలర్‌ వాహనాలకు 30 రూపాయలు వసూలు చేయాల్సి ఉండగా.. 60రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇదంతా ఈవో రమాదేవి ఆకస్మిక తనిఖీల్లో వెల్లడైంది. భక్తుల నుంచి అదనంగా పార్కింగ్‌ ఫీజు వసూలు చేస్తున్నట్టు తేలడంతో కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈవో రమాదేవి. వారి దగ్గర ఉన్న రశీదు బుక్కులను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 20కిపైగా బుక్కులను స్వాధీనం చేసుకున్నారు. పార్కింగ్‌ టెండర్‌ రద్దు చేశారు. కాంట్రాక్టర్‌ లచ్చయ్యపై క్రిమినల్‌ కేసు నమోదు చేస్తున్నట్టు తెలిపారు. సీఐకి ఫోన్‌ చేసి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కోరారు.