Vijayashanthi: పద్మ అవార్డులపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు.. ఇంతమంది ఉన్నా ఏం చేస్తున్నారు.?

కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాలపై ట్విటర్ వేదికగా కాంగ్రెస్ నేత, సినీనటి విజయశాంతి స్పందించారు. అంతమంది ఉండి ఏం చేస్తున్నారంటూ ఆమె ప్రశ్నించారు.

Vijayashanthi: పద్మ అవార్డులపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు.. ఇంతమంది ఉన్నా ఏం చేస్తున్నారు.?

Vijayashanti

Updated On : January 27, 2025 / 6:12 PM IST

Vijayashanthi: కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా 139 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. వీరిలో ఏడుగురికి పద్మ విభూషణ్, 19మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మ శ్రీ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఏడుగురు తెలుగు వారికి అవార్డులు దక్కాయి. ఇందులో తెలంగాణ నుంచి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఐదుగురికి పురస్కారాలు లభించాయి. తెలంగాణ నుంచి వైద్య విభాగంలో దువ్వురు నాగేశ్వర్ రెడ్డికి పద్మవిభూషణ్, ప్రజా వ్యవహారాల విభాగంలో మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు లభించింది. ఏపీ చెందిన వారిలో కళారంగం నుంచి మాడుగుల నాగఫణి శర్మ, మిర్యాల అప్పారావు (మరణానంతరం), సాహిత్యం, విద్యారంగం నుంచి కేఎల్ కృష్ణ, వాదిరాజ్ రాఘవేంద్రాచార్య, కళల విభాగంలో సినీనటుడు బాలకృష్ణకు పద్మ పురస్కారాలు వరించాయి. అయితే, కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Also Read: Pawan Kalyan : వాటి జోలికి వెళ్లొద్దు- జనసైనికులకు పవన్ కల్యాణ్ బహిరంగ లేఖ.. ఇంకా ఏమన్నారంటే..

కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో తెలంగాణపై వివక్ష స్పష్టంగా కనిపించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, జయధీర్ తిరుమలరావు, గోరటి వెంకన్నల్లో ఒక్కరికీ అవార్డు ప్రకటించకపోవడం పట్ల రేవంత్ తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. ఏపీకి ఐదు పురస్కారాలు ఇచ్చారు.. తెలంగాణకు కనీసం నాలుగైనా ఇవ్వకపోవటం బాధాకరమని, ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తానాని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా.. పద్మ పురస్కారాలపై సినీ నటి, కాంగ్రెస్ నేత విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read: Balakrishna : పద్మ భూషణ్ రావడంపై మొదటిసారి మీడియాతో మాట్లాడిన బాలయ్య.. లేట్ గా వచ్చిందా అని అడిగితే..

కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాలపై ట్విటర్ వేదికగా విజయశాంతి స్పందించారు. ‘‘కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలంగాణకు కనీసం నాలుగు అయినా వచ్చి ఉండాలి.. అనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయాన్ని  తప్పక పరిశీలించాల్సిన విషయం. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎనిమిది మంది ఎంపీలున్న బీజేపీ కూడా కొంత ఆలోచన చేస్తే మంచిదే.’’ అంటూ విజయశాంతి పేర్కొన్నారు.