అసెంబ్లీలోనే సర్కార్‌పై అటాక్ చేస్తే బాగుండేదంటున్న బీఆర్ఎస్ నేతలు.. ఎందుకంటే?
బీఆర్ఎస్‌పై, కేసీఆర్‌పై సభలో సీఎం రేవంత్, ఉత్తమ్ విమర్శలు, ఆరోపణలు చేస్తున్నప్పుడు తాము అక్కడ లేకపోవడం కొట్టొచ్చినట్లు కనిపించిందని చెబుతున్నారు.
KCR, Revanth Reddy (Image Credit To Original Source)
- బీఆర్ఎస్ బాయ్‌కాట్.. అధికార పార్టీ వన్ సైడ్ అటాక్
- నదీ జలాల ఇష్యూలో కేసీఆర్‌దే తప్పన్న రేవంత్
- కాంగ్రెస్ ద్రోహాలు పేరుతో పీపీటీతో హరీశ్ కౌంటర్
BRS: తెలంగాణ పాలిటిక్స్‌లో వాటర్ వార్ నెక్స్ లెవల్ హీట్‌ను క్రియేట్ చేస్తోంది. కేసీఆర్ హయాంలో అంతా తెలిసి తెలంగాణకు ద్రోహం చేశారని సీఎం రేవంత్ ఆరోపిస్తే..కాంగ్రెస్ ద్రోహాలు పేరుతో..బీఆర్ఎస్ కౌంటర్ అటాక్ చేస్తోంది. సీఎం రేవంత్ అసెంబ్లీ మాట్లాడిన ప్రతీ మాటకు, ఆరోపణకు తెలంగాణ భవన్ వేదికగా.. కృష్ణ జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు మాజీ మంత్రి హరీశ్‌రావు.
తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రాతో కలపడమే కాంగ్రెస్ చేసిన మొదటి తప్పయితే, కలిపిన తర్వాత ఫజల్ అలీ కమిషన్ సూచనలకు విరుద్ధంగా ఈ ప్రాంతానికి మేలు చేసే ప్రాజెక్టులను రద్దు చేశారని హరీశ్‌రావు మండిపడ్డారు.
నాడు ఏలేశ్వరం దగ్గర కట్టాల్సిన నాగార్జునసాగర్ ప్రాజెక్టును నందికొండకు తరలించడం ద్వారా నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు కాంగ్రెస్ తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. కృష్ణా జలాలు, పారమూరు ఎత్తిపోతల విషయంలో అసెంబ్లీ సాక్షిగా రేవంత్ అన్నీ అబద్ధాలే చెప్పారని..ఇవిగో ఆధారాలు అంటూ వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేశారు.
Also Read: కాంగ్రెస్ Vs బీజేపీ.. ఏపీ సెంట్రిక్‌గా “ఉపాధి” పోరు..!
రెండున్నర గంటల పాటు హరీష్ రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బీఆర్ఎస్ నేతలను బాగా ఆకట్టుకుంది. ఆయన లేవనెత్తిన అంశాలపై అటు సోషల్ మీడియాలో..ఇటు బీఆర్ఎస్ నేతల్లో కూడా చర్చ జరుగుతోంది. రేవంత్‌కు హరీశ్‌రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారని ఫుల్ ఖుష్ అవుతున్నారట గులాబీ లీడర్లు, క్యాడర్.
అసెంబ్లీ వేదికగా చెప్పి ఉంటే ఇంకా బాగుండేదంటూ..
కాకపోతే ఇదే మ్యాటర్‌ను అసెంబ్లీ వేదికగా చెప్పి ఉంటే ఇంకా బాగుండేదనేది ఇంటర్నల్ డిస్కషన్ అంటున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు స్పీకర్ అవకాశం ఇవ్వకపోయినా..కృష్ణా జలాలపై పీపీటీలో చెప్పిన అంశాల్లోని కీలక విషయాలను శాసనసభలో ప్రస్తావిస్తే ఇంకా మెస్సేజ్ బాగా వెళ్లేదని చర్చించుకుంటున్నారట.
తెలంగాణ భవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి, అసెంబ్లీలో మాట్లాటడానికి చాలా వ్యత్యాసం ఉందనేది బీఆర్ఎస్ సీనియర్ల అభిప్రాయమంటున్నారు. అసెంబ్లీ నుంచి బాయ్‌కాట్ చేయాల్సి ఉండేది కాదని..నదీజలాలపై చర్చ సమయంలో అవకాశం ఇవ్వకపోతే వాకౌట్ చేస్తే బాగుండేదన్న ఒపీనియన్స్ కూడా వ్యక్తం అవుతున్నాయట.
బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన
అసెంబ్లీలో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఇచ్చిన పీపీటీ ప్రజల్లోకి వెళ్లిందని కొందరు బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. మనం కూడా అసెంబ్లీ వేదికగానే ప్రభుత్వం చేసిన ఆరోపణలను తిప్పికొడితే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. ఒకవేళ చర్చ సందర్భంగా తగిన సమయం ఇవ్వకపోయినా, అధికార కాంగ్రెస్ పార్టీ లేదంటే స్పీకర్ అడ్డు తగిలినా అప్పుడు సభను బైకాట్ చేసి బయటకు వస్తే వేరేలా ఉండేదని చర్చించుకుంటున్నారట కారు పార్టీ సీనియర్ లీడర్లు.
బీఆర్ఎస్‌పై, కేసీఆర్‌పై సభలో సీఎం రేవంత్, ఉత్తమ్ విమర్శలు, ఆరోపణలు చేస్తున్నప్పుడు తాము అక్కడ లేకపోవడం కొట్టొచ్చినట్లు కనిపించిందని చెబుతున్నారు. ఆ సమయంలో అసెంబ్లీలో ఉండి ఉంటే వారి ప్రసంగానికి అడ్డు తగలడం, మధ్యలో కల్పించుకోవడం, లేకపోతే ఆఖరికి నిరసన తెలిపి బయటకు రావడం..ఇలా ఏదో ఒకటి జరిగేదని..కానీ వార్ వన్ సైడ్ అన్నట్లుగా కాంగ్రెస్ సభను నడిపించుకుందన్న భావనలో ఉన్నారట గులాబీ లీడర్లు.
ఇదే సమయంలో బీజేపీ కూడా అసెంబ్లీని బాయ్‌కాచ్ చేయడంతో మరోసారి బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనన్న చర్చ మొదలైందని.. ఇదంతా పార్టీకి ఇబ్బందికరంగా మారిందని మాత్రం తెలంగాణ భవన్‌లో జోరుగా చర్చ జరుగుతోంది.
