support price : మద్దతు ధర ప్రకారమే ధాన్యం కొనుగోలు చేస్తాం : సీఎం కేసీఆర్
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలపై తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. రైతులు దిగులుపడాల్సిన అవసరం లేదు..ధన్యాన్ని కొంటామని చెప్పారు.

Kcr
support price : రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలపై తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. రైతులు దిగులుపడాల్సిన అవసరం లేదు..ధన్యాన్ని కొంటామని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం మాట్లాడుతూ మద్దతు ధర ప్రకారమే ధాన్యాన్ని తీసుకుంటామని చెప్పారు. వ్యవసాయ మార్కెట్లను కేంద్రం రద్దు చేసినా..రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్లను కొనసాగిస్తామని చెప్పారు. మద్దతు ధర ప్రకారం రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారు.
అంతకముందు సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం 39.36 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. గతంలో రూ.200 ఉన్న పెన్షన్ ను రూ.2 వేలకు పెంచామన్నారు. భూసేకరణ రేట్లు అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండదని స్పష్టం చేశారు.
50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్నసాగర్ నిర్మిస్తున్నామని చెప్పారు. మల్లన్నసాగర్ ను అడ్డుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారని పేర్కొన్నారు. మల్లన్నసాగర్ ను అడ్డుకునేందుకు కోర్టుల్లో 300కు పైగా కేసులు వేశారని తెలిపారు.