V Hanumantha Rao : ఎల్బీ స్టేడియంలో అలా చేయొద్దు.. లేదంటే నిరాహారదీక్ష చేస్తాం- వీహెచ్ వార్నింగ్
V Hanumantha Rao : క్రీడా రంగాన్ని, క్రీడాకారులను కేసీఆర్ చిన్నచూపు చూస్తున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో కేసీఆర్ క్రీడా రంగానికి ప్రాధాన్యత ఇచ్చారా?

V Hanumantha Rao (Photo : Google)
V Hanumantha Rao – LB Stadium : హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎల్బీ స్టేడియంలో క్రీడా కార్యక్రమాలు కాకుండా ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వీహెచ్ ధ్వజమెత్తారు. ఇకపై ఆ స్టేడియంలో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తే ఇతర క్రీడాకారులతో కలిసి నిరాహారదీక్ష చేస్తామని వీహెచ్ హెచ్చరించారు.
‘ వైఎస్ సీఎంగా వున్నప్పుడు సీఎం కప్ క్రికెట్ టోర్నమెంట్ పెట్టినప్పుడు గెలిచిన క్రీడాకారులకు వెంటనే నగదు ఇచ్చారు. తెలంగాణలో సీఎం కప్ నిర్వహించి గెలిచిన వారికి ఇప్పటివరకు నగదు ఇవ్వలేదు. ఇతర క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణించిన వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవడం లేదు. బీసీ బంధు పెట్టి లక్ష రూపాయలు ఇస్తామని చెబుతున్నారు. కానీ, బీసీ క్రీడాకారులను ప్రోత్సహించడం లేదు.
సీఎం కేసీఆర్.. కలెక్టర్ కార్యాలయాలు, ఎస్పీ కార్యాలయాలు, బీఆర్ఎస్ కార్యాలయాలు కడుతున్నారు. కానీ గ్రామీణ, పేద క్రీడాకారులు రాణించేందుకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు కట్టడం లేదు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల నిర్మాణలకు స్థలం కేటాయిస్తున్న కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు మాత్రం స్థలం కేటాయించడం లేదు. క్రీడా రంగాన్ని, క్రీడాకారులను కేసీఆర్ చిన్నచూపు చూస్తున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో కేసీఆర్ క్రీడా రంగానికి ప్రాధాన్యత ఇచ్చారా? ఆంధ్రాలో ప్రతి జిల్లాకు క్రీడా స్టేడియాలు ఉన్నాయి’ అని వీహెచ్ అన్నారు.
Also Read..Uniform Civil Code: ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏమిటి.. దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటి?