Weather: తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు: వాతావరణ శాఖ

కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Weather: తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు: వాతావరణ శాఖ

Telangana Rains

Updated On : August 18, 2023 / 6:24 PM IST

Weather – Rain: తెలంగాణ(Telangana) లో రాగల మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయవ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లోని పశ్చిమ బెంగాల్ – ఉత్తర ఒరిశా తీరాల్లో అల్పపీడనం కొనసాగుతుంది.

అల్ప పీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలో మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఈ అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ రాగల 2 నుంచి 3 రోజుల్లో ఉత్తర ఒడిశా, ఉత్తర చత్తీస్‌గఢ్ మీదుగా వెళ్లే అవకాశం ఉంది. పశ్చిమ/వాయవ్య దిశల నుంచి దిగువ స్థాయిలోని గాలులు తెలంగాణ వైపుగా వీస్తున్నాయి.

దీంతో మూడు రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నరగంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం మోస్తరు వర్షం పడింది.

UAE astronaut Sultan Al Neyadi : అంతరిక్షంలో తండ్రి.. భూమిపై కొడుకు.. మనసుని హత్తుకున్న ఇద్దరి సంభాషణ