ఆ పోలీస్ అధికారికి స్వామి భక్తి రివర్స్ అయిందా?
మొత్తానికి ఒకే ఒక్కడు చేసిన స్వామిభక్తి పని... డిపార్ట్‌మెంట్ మొత్తాన్ని షేక్ చేస్తోందట.

ఆ పోలీస్ అధికారి స్వామి భక్తి రివర్స్ అయిందా..? అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. సార్ కొట్టిన మస్కాపై మండి పడ్డారా..? గులాబీ గుఢాచార్యానికి దక్కిన సడన్ సర్ ప్రైజ్ ఏంటి? బీఆర్ఎస్ రజతోత్సవాలపై సీఎంకు ఇంటలిజెన్స్ ఏం చెప్పింది? ఓరుగల్లు ఓవర్ యాక్షన్ ని ఉన్నది ఉన్నట్టు సీఎం రేవంత్ కు చేరవేసిన ఐఏఎస్ ఎవరు? ఆ సార్వడు చేసిన పనికి కాళ్లకింద భూమి కదులుతున్న శాఖలేంటి? ఇదే ఇప్పుడు వరంగల్ పోలీస్ శాఖలోనే కాదు పొలిటికల్ సర్కిల్స్ లోనూ హాట్ హాట్ గా చర్చ జరుగుతోందట. ఇంతకీ స్వామిభక్తిని ప్రదర్శించిన ఆ పోలీస్ అధికారి ఎవరు? వాచ్ దిస్ స్టోరీ.
ఓరుగల్లు వేదికగా జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోందన్న టాక్ హస్తం పార్టీనేతల్లో విన్పిస్తోంది. అంచనాలకు మించి వచ్చిన జనం ఒక వైపు, సభ నిర్వహణ తీరు ప్రజా వ్యతిరేకతకు అద్దంపట్టే కాషన్ అని ఇంటలిజెన్స్ వర్గాలు ఇచ్చిన నివేదిక మరో వైపు ప్రభుత్వాన్ని అంతర్మథనంలో పడేసిందట.
హస్తినలోని టెన్ జన్ పథ్ లో దీనిపైనే హాట్ హాట్ గా చర్చ జరుగుతోందట. వేగులు వెంట వెంటనే తెలంగాణ ఇన్ ఫోని రాహుల్ గాంధీ చెవిలో వేస్తున్నారట. దీంతో పార్టీ హైకమాండ్ ఒక్కసారిగా అలర్ట్ అయి గ్రౌండ్ రియాల్టీని తెలుసుకునేందుకు ఇంచార్జ్ లను రంగంలోకి దించిందట. ఇంకేముంది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశంతో పార్టీతో పాటు అన్ని సోర్స్ లు యాక్టివ్ అయి పోస్టు మార్టంలో పడ్డాయట.
Also Read: చంద్రబాబు ఢిల్లీ సడన్ టూర్ వ్యూహం అదేనా?
ఇందులో ఆసక్తికరంగా ఓ పోలీస్ అధికారి ఓవర్ యాక్షన్ తెరపైకి రావడంతో సర్కార్ వెంటనే రియాక్ట్ అయి రంగంలోకి దిగింది. ఔత్సాహిక అధికారులకు సడెన్ సర్ ప్రైజ్ లను గిఫ్ట్ గా ఇస్తోంది. గులాబీ రజతోత్సవ సభ అనుమతి వ్యవహారంలో సదరు అధికారి మౌఖిక ఆదేశం, గ్రీన్ సిగ్నల్ వల్లనే బీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరించిందని భావించిన కాంగ్రెస్ అగ్గిమీద గుగ్గిలమవుతోంది. అందుకు ప్రస్తుతం పోలీస్ శాఖలో జరుగుతున్న పరిణామాలే అద్దం పడుతున్నాయన్న టాక్ విన్పిస్తోంది.
అలా ఎందుకు చేశారన్న దానిపై కూపీలాగిన సర్కారు?
సభా ప్రాంగణంలో జరిగిన పూడ్చివేతలు, భారీ ఎత్తున మొరం తవ్వకాలపై అధికార పార్టీ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రత్యక్ష పోరాటానికే దిగారు. సహజ సిద్ధమైన పెద్దవాగు, దేవాదుల కాల్వల పూడ్చివేత, పొలాల్లో జరిగిన హద్దురాళ్ల తొలగింపుపై తీవ్రంగా స్పందించిన అధికార పార్టీ..హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్య సహా ఇరిగేషన్, రెవెన్యూ, ఫారెస్ట్, విద్యుత్, మైన్స్ అండ్ జియాలజీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసింది. 1500 ఎకరాల పంట పొలాల్లో నిర్వహించే సభ నిర్వహణ విషయంలో ఇరిగేషన్, రెవెన్యూ, ఫారెస్ట్, విద్యుత్, మైన్స్ అండ్ జియాలజీ శాఖల ప్రమేయం లేకుండానే ఓ అధికారి ఓవర్ యాక్షన్ మూలంగా జరగాల్సిన తతంగం అంతా జరిగిపోయిందని ప్రభుత్వం ఓ నిర్ధారణకు వచ్చిందట.
గులాబీ సభపట్ల అత్యుత్సాహం ప్రదర్శించిన ఆ అధికారి అలా ఎందుకు చేశారన్న దానిపై ప్రభుత్వం కూపీ లాగిందట. అయిత తన చిరకాల వాంఛ నెరవేర్చిన మాజీల పట్ల స్వామి భక్తి చాటుకున్నారనే విషయం ప్రభుత్వానికి చాలా ఆలస్యంగా బోధ పడిందట. అందుకే బిఆర్ఎస్ మాజీలకు పరోక్ష సహాకారం అందించారని ఇంటలిజెన్స్ నివేదిక బయటపెట్టింది. దీంతో స్వామిభక్తి చాటుకున్న సదరు అధికారికి సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చిందనే చర్చ జరుగుతోంది.
సదరు సార్వడు ట్రాక్ రికార్డు చూసిన ప్రభుత్వం సరైన సీట్లో కూర్చోబెట్టి సెటిల్ చేయాలనుకుందట. అందుకే ఏ శాఖ పేరు చెబితే హైదరాబాద్ లో రాజకీయ పక్షాలు ఒంటికాలిపై లేస్తున్నాయో అదేశాఖ కుర్చీలో సైలెంట్ గా కూర్చో బెట్టారట. ఆ అధికారికి అది తగిన పోస్టింగే అంటూ అటు పోలీస్ శాఖలోనూ, ఇటు ప్రజా ప్రతినిధుల్లోనూ చర్చ జరుగుతోంది.
ఈ వ్యవహారంలో డబుల్ గేమ్ ఆడిన అధికారులందరికి ట్రాన్స్ ఫర్స్ గిఫ్ట్ ను సర్కార్ సైలెంట్ గా చేరవేస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. సార్ చేసిన స్వామి భక్తి అన్ని శాఖల బాస్ ల సీట్ల కిందకు నీళ్లు తెస్తోందట. దీంతో ఆయా అధికారుల కాళ్ల కింద భూమి కదులుతోందనే ప్రచారం జరుగుతోంది. అలా ఒక్కో ట్రాన్స్ ఫర్ చాలా సైలెంట్ గా జరిగిపోతోందట. ఏ క్షణంలో ఎవరికి సర్కార్ నుంచి రిటన్ గిఫ్ట్ వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందట.
మొత్తానికి ఒకే ఒక్కడు చేసిన స్వామిభక్తి పని…డిపార్ట్ మెంట్ మొత్తాన్ని షేక్ చేస్తోందట. మరోసారి ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే దాని రిజల్ట్ ఇలా ఉంటుందనే రేంజ్ లో సర్కార్ చాలా వ్యూహాత్మకంగా పావులు కదిపిందన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.