‘Mangalsutra’at MRO office : తహశీల్దార్ ఆఫీసు గుమ్మానికి ‘తాళిబొట్టు’కట్టిన మహిళ

రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన ఓ మహిళ తన మెడలో ఉన్న మంగళసూత్రం తీసి తహశీల్దార్ కార్యాలయం గుమ్మానికి కట్టింది. గత మూడేళ్లనుంచి తన భూమికి పట్టా ఇవ్వకుండా అధికారులు వేధిస్తున్నారని అందుకే ఇలా చేశానని వాపోయింది.

‘Mangalsutra’at MRO office : తహశీల్దార్ ఆఫీసు గుమ్మానికి ‘తాళిబొట్టు’కట్టిన మహిళ

Mangalsutra At Mro Office

Updated On : June 30, 2021 / 5:37 PM IST

Woman ‘talibottu’ at Tahsildar’s office తెలంగాణలోని రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన ఓ మహిళ తన మెడలో ఉన్న మంగళసూత్రం తీసి తహశీల్దార్ కార్యాలయం గుమ్మానికి కట్టింది. ఇలా ఎందుకు చేసిందంటే గత మూడేళ్లనుంచి తన భూమికి చెందిన పట్టా ఇవ్వకుండా అధికారులు వేధిస్తున్నారని అందుకే ఇలా చేశానని అంటోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి తహశీల్దార్ కార్యాలయం ముందు కూర్చున్న మంగ అనే మహిళ తన తాళిబొట్టు తీసి తహశీల్దార్ కార్యాలయం గుమ్మానికి కట్టి వినూత్నంగా నిరసన తెలిపింది.

తన భూమికి సంబంధించిన పట్టా తయారు చేసి ఇవ్వకుండా తనను గత మూడేళ్ల నుంచి అధికారులు పదే పదే తిప్పుకుంటున్నారని..భూమి పట్టా చేయాలంటే లంచం అడుగుతున్నారని ఆవేదన వ్యక్తంచేసింది. మూడేళ్లనుంచి తను తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు ఏమాత్రం పట్టించకోవట్లేదనీ..లంచం ఇస్తేనే గానీ పని అవ్వదని బెదరిస్తున్నారని వాపోతోంది. తన వద్ద డబ్బులేమీ లేవని ‘ నా తాళిబొట్టు’ తీసుకుని తన భూమికి పట్టా చేసి ఇవ్వాలంటూ కార్యాలయం ముందు కూర్చుని నిరసన వ్యక్తంచేస్తోంది.

రుద్రంగి మండలం మానాలకు చెందిన మంగ అనే మహిళకు సర్వే నంబర్ 130/14లో రెండు ఎకరాల భూమి ఉంది. ఆ భూమి పట్టా కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ మూడు సంవత్సరాలుగా తిరుగుతోంది మంగ. కానీ అధికారుల్లో ఏమాత్రం చలనం లేదు. పట్టా చేసి ఇవ్వాలంటే లంచం ఇవ్వాల్సిందేనని లేకుండా పని జరగదని నిస్సిగ్గుగా చెప్పేశారు. తన భర్త చనిపోయి మూడు సంవత్సరాలు అయ్యిందనీ..అప్పటినుంచి తాను భూమి పట్టా కోసం తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతునే ఉన్నానని కానీ అధికారులు మాత్రం తన గోడు పట్టించుకోకుండా వేధిస్తున్నారని లంచం డిమాండ్ చేస్తున్నారని మంగ వాపోయింది.

తన భర్త చనిపోయిననాటి నుంచి తన పిల్లల్ని పెంచుకోవటానికి నానా కష్టాలు పడుతున్నానని కూలిపనికి వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటున్నాననీ.. ‘భర్తను కోల్పోయి పిల్లలతో నేను నానా కష్టాలు పడుతున్న నా దగ్గర లంచం ఇవ్వటానికి చిల్లిగవ్వకూడా లేదని అటువంటిది నన్ను లంచం కోసం వేధించం మీకు భావ్యం కాదు సారూ..నా భూమి పట్టా చేసి పెట్టండి సారూ..మీ కాళ్లు పట్టుకుంటాను‘ అంటూ కన్నీటితో వేడుకుంటోంది మంగ. తన భర్త చనిపోయిన తరువాత తమ బంధువులు భూమి తనదేని అమ్మేసుకున్నారని..దయచేసి నా భూమి నాపేరు మీద పట్టా చేయించి ఇచ్చి నాకు న్యాయం చేయాలని వేడుకుంటోంది మంగ.