YS Jagan: మనం యుద్ధం చేసేది చంద్రబాబుతోనే కాదు.. వాటిపై కూడా.. వైసీపీ వ‌ర్క్‌షాప్‌లో జగన్ కీలక వ్యాఖ్యలు

ఏపీలో ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూసిఉండం. నాలుగు నెలల్లోనే కూటమి ప్రభుత్వం వద్దు అని ప్రజలే అంటున్నారు.

YS Jagan: మనం యుద్ధం చేసేది చంద్రబాబుతోనే కాదు.. వాటిపై కూడా.. వైసీపీ వ‌ర్క్‌షాప్‌లో జగన్ కీలక వ్యాఖ్యలు

YS Jagan Mohan Reddy

Updated On : October 17, 2024 / 2:06 PM IST

YS Jagan Mohan Reddy: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తగిన సమయం ఉంటుంది.. పార్టీని మరింత పటిష్టం చేయడానికి మంచి అవకాశమని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గురువారం వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వర్క్ షాప్ లో జగన్ పాల్గొని మాట్లాడారు. 15ఏళ్లలో పార్టీ ప్రస్థానం ముందుకు సాగింది. కాకపోతే మనం ఆర్గనైజ్డ్ గా యుద్ధం చేస్తున్నామా లేదా అనేది చాలా ముఖ్యం. పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకు సాగితేనే అది మంచి ఫలితాలను ఇస్తుంది. అప్పుడే మనం రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ఎఫెక్టివ్ గా ఉంటామని జగన్ సూచించారు. జమిలి అంటున్నారు.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆర్గనైజ్డ్‌గా ఉంటే మన సన్నద్ధంగా ఉంటాం. మరో ఆరు నెలల్లో మళ్లీ సమావేశం ఏర్పాటయ్యే నాటికి గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు కావాలని జగన్ పార్టీ నేతలకు సూచించారు.

Also Read; Nayab Singh Saini: హరియాణా సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం.. హాజరైన మోదీ, చంద్రబాబు.. వీడియోలు వైరల్

బూత్‌ కమిటీలుకూడా ఏర్పాటు కావాలి. కమిటీలు ఏర్పాటు అనేది కాగితాలకే పరిమితం కాకూడదు. గ్రామ స్థాయి నుంచి మనకు కమిటీలు, నాయత్వంలేక కాదు. కాకపోతే వీటిని నిర్మాణాత్మక వ్యవస్థల్లోకి తీసుకురావాలి. గ్రామస్థాయిలోకూడా నిర్మాణాత్మకంగా ఉండాలి. అప్పుడు మనం ఇచ్చిన పిలుపునకు మంచి స్పందన వస్తుందని జగన్ అన్నారు. మనం ఇంట్లో కూర్చుంటే.. ఏమీ జరగదు. మనం చొరవ తీసుకొని అన్ని అంశాలపై స్పందించాలి అని పార్టీ నేతలకు జగన్ సూచించారు. మనం యుద్ధం చేసేది చంద్రబాబుతోనే కాదు.. చెడిపోయిన వ్యవస్థలతో యుద్ధం చేస్తున్నాం. టీడీపీ తప్పుడు సోషల్‌ మీడియాలతో యుద్ధం చేస్తున్నాం. అబద్ధాలను సృష్టించి ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. మనం అంతకన్నా బలంగా తయారు కావాలి. పార్టీ కమిటీలన్నీకూడా సోషల్‌మీడియాకు అనుబంధం కావాలి.

సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండాలి. అన్యాయాలను మనం ఎండగట్టాలి. పార్టీ సందేశాలుకూడా గ్రామస్థాయికి వెళ్లాలి.. ఇదంతా సోషల్‌ మీడియాద్వారా జరగాలని జగన్ సూచించారు. జిల్లా అధ్యక్షులు, కమిటీల్లోని వారు మీమీ పనితీరు ఆధారంగా మీ ప్రమోషన్లు ఉంటాయి. మీరు ప్రూవ్‌ చేసుకోండి.. తప్పకుండా ప్రాధాన్యత, అవకాశాలు కల్పిస్తాం. మీకు ప్రమోషన్‌ ఇచ్చే బాధ్యత మాది. మీలో ఎక్కువమంది మనం అధికారంలోకి రాగానే మంత్రి వర్గంలో ఉండాలని ఆశిస్తున్నానని జగన్ పేర్కొన్నారు. మీ పనితీరుపై పరిశీలన, మానిటరింగ్‌ ఉంటుంది. నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిల పనితీరుపైనా పరిశీలన ఉంటుంది.. రిపోర్టుల ప్రకారం నిర్ణయాలు కూడా ఉంటాయి. బాగా పనిచేసేవారికీ రేటింగ్స్ ఇవ్వడం జరుగుతుందని జగన్ చెప్పారు.

Also Read: Drone Summit 2024: అమరావతిలో డ్రోన్ సమ్మిట్.. దేశంలోనే అతిపెద్ద ఈవెంట్.. ఐదు వేలకుపైగా డ్రోన్లతో డ్రోన్‌ షో..

ఏపీలో ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూసిఉండం. నాలుగు నెలల్లోనే ఈ ప్రభుత్వం వద్దు అని ప్రజలే అంటున్నారు. ఇసుక టెండర్లకు రెండు రోజులే గడువు. కనీసం టెండర్లు పిలుస్తున్నారన్న విషయం ఎవ్వరికీ తెలియదు. టెండర్లు వేయడానికి ఎవ్వరూకూడా పోని పరిస్థితి. ఇసుక రేటు వైసీపీ ప్రభుత్వంలోకంటే డబుల్‌ రేటు, ట్రిపుల్‌ రేటు పలుకుతుంది. ఇసుక సొమ్మును దోచుకోవడానికి పాలసీని మార్చారు. స్టాక్‌ యార్డులు, రీచ్‌లు అధికారంలోకి వచ్చిన కొన్నిరోజులకే ఖాళీ చేసేశారు. లిక్కర్‌ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అంటూ.. కూటమి ప్రభుత్వంపై జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికార పార్టీ నేతలకు, వారి అనుచరులకు ప్రతినియోజకవర్గంలో 10 పేకాట క్లబ్ లు నడుస్తున్నాయి. ఎవరు ఏం చేయాలన్నా ఎమ్మెల్యేలకు కప్పం కట్టాల్సిందే. డబ్బు ఇవ్వకపోతే వ్యాపారమే లేదు. పోలీసుల సహాయంతో బెదిరిస్తున్నారని కూటమి పార్టీల నేతలపై జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.