తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం.. ఈ జిల్లాల వారు జాగ్రత్త.. ఎల్లో అలర్ట్ జారీ

పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం.. ఈ జిల్లాల వారు జాగ్రత్త.. ఎల్లో అలర్ట్ జారీ

Updated On : October 20, 2025 / 7:50 AM IST

Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో వర్షాలు కురుస్తాయని అన్నారు.

బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే ఛాన్స్‌ ఉందని చెప్పారు. దీంతో ఏపీలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అన్నారు. తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. భారీ వర్షాలు కురిసే సూచనలు ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. (Weather Updates)

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇవాళ హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరితో పాటు వరంగల్‌, హనుమకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.

అలాగే, మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌ కర్నూల్, వనపర్తి రంగారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయింది.