YS Sharmila: ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలిసిన తర్వాత.. షర్మిల చేసిన రెండో ట్వీట్ ఇది..
ఈ నేపథ్యంలో ఆమె దాని గురించి స్పందించడం లేదు. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాత్రమే పోస్టులు చేస్తున్నారు.

YS Sharmila
YS Sharmila – Telangana: ప్రజా గాయకుడు గద్దర్ (Gaddar) సమాధి వద్ద నివాళులు అర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించానని వైఎస్సార్టీపీ (YSRTP) అధినేత్రి షర్మిల అన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె పోస్ట్ చేశారు. కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీని విలీనం చేస్తారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆమె దాని గురించి స్పందించడం లేదు. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాత్రమే పోస్టులు చేస్తున్నారు. షర్మిల ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలిసి వచ్చాక చేసిన రెండో ట్వీట్ ఇది. షర్మిల కాంగ్రెస్ తో చర్చలు జరిపి శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ వచ్చారు. శనివారం గ్రూప్–2 పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇవాళ కూడా కేసీఆర్ సర్కారుపై మండిపడ్డారు.
” గద్దర్ తెలుగు ప్రజల కోసం పుట్టిన మనిషి. ప్రజల గుండెల్లో ఎప్పుడూ బతికే ఉంటారు. ఆయన కృషి, కష్టం, త్యాగానికి గుర్తుగా ట్యాంక్ బండ్ పై గద్దర్ విగ్రహాన్ని పెట్టాలి. గద్దర్ జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో ముద్రించాలి. తూప్రాన్ లో స్మారక భవనం నిర్మించాలి. గద్దర్ బ్రతికి ఉన్నప్పుడు అవమానించిన కేసీఆర్.. ఇప్పుడు కపట ప్రేమ ప్రదర్శిస్తున్నాడు.
తెలంగాణ కోసం పోరాటం చేసిన గద్దర్ గారికి తొమ్మిదేళ్లుగా కేసీఆర్.. అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించాడు. ప్రశ్నించిన గద్దర్ ను జైల్లో సైతం పెట్టించాడు. గద్దర్ కుటుంబ సభ్యులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. వైఎస్సార్ అంటే గద్దర్ గారికి ఎనలేని ప్రేమ. నాతో చాలాసార్లు వైఎస్సార్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. గద్దర్ గుండెల్లో వైఎస్సార్ ఉన్నారు. మన గుండెల్లో గద్దర్ ఉన్నారు ” అని షర్మిల అన్నారు.
ప్రజా గాయకుడు గద్దర్ గారి సమాధి వద్ద నివాళి అర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించడం జరిగింది. గద్దర్ తెలుగు ప్రజల కోసం పుట్టిన మనిషి. ప్రజల గుండెల్లో ఎప్పుడూ బతికే ఉంటారు. ఆయన కృషి, కష్టం, త్యాగానికి గుర్తుగా ట్యాంక్ బండ్ పై గద్దర్ విగ్రహాన్ని పెట్టాలి. గద్దర్ జీవిత చరిత్రను… pic.twitter.com/AmcOClmDiS
— YS Sharmila (@realyssharmila) August 13, 2023