రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావుకు నివాళులర్పించిన వైఎస్ షర్మిల

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లి రామోజీరావు చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం వారి కటుుంబ సభ్యులను పరామర్శించారు.

రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావుకు నివాళులర్పించిన వైఎస్ షర్మిల

ys sharmila

YS Sharmila : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుకు నివాళులర్పించారు. ఇటీవల అనారోగ్యంతో రామోజీరావు కన్నుమూసిన విషయం విధితమే. ఆయన మృతిరోజు ఎక్స్ (ట్విటర్) వేదికగా నివాళులర్పించిన షర్మిల.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అయితే, బుధవారం రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన నివాసానికి చేరుకున్న షర్మిల.. రామోజీ చిత్రపటం వద్ద అంజలి ఘటించారు.

Also Read : కన్నీరు పెట్టుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి.. వాళ్లను వదిలిపెట్టనని వార్నింగ్..

రామోజీరావు సతీమణి రమాదేవిని పరామర్శించారు. మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి సహా కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను షర్మిల తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ‘ఇవాళ రామోజీ ఫిలిం సిటీలో ఇటీవల స్వర్గస్తులైన శ్రీ రామోజీ రావు గారికి నివాళులు అర్పించడం జరిగింది. వారి నివాసంలో కుటుంబసభ్యులను కలిసి పరామర్శించటం జరిగింది.’ అంటూ షర్మిల పేర్కొన్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by YS Sharmila Reddy (@realyssharmila)