YS Sharmila : ఆశలు వదులుకున్న షర్మిల.. పాలేరుతో పాటు మిర్యాలగూడ నుంచి పోటీ?
పార్టీ కార్యవర్గ సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, భవిష్యత్తు కార్యాచరణపై షర్మిల చర్చించనున్నారు. YS Sharmila

Sharmila To Contest Elections Alone
Sharmila To Contest Elections Alone : కాంగ్రెస్ లో వైఎస్ఆర్ టీపీ విలీనంపై ఆశలు వదులుకున్నారు వైఎస్ షర్మిల. ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో రేపు(అక్టోబర్ 12) మధ్యాహ్నం పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ ఎన్నికలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. పాలేరుతో పాటు మిర్యాలగూడ నుంచి పోటీ చేసే యోచనలో షర్మిల ఉన్నారు. త్వరలోనే పాలేరులో పాదయాత్ర చేపట్టనున్నారు. రేపు ఎన్నికల కార్యాచరణ ప్రకటించనున్న షర్మిల.. 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టనున్నారు.
షర్మిల ప్రయత్నాలు విఫలం..
కాంగ్రెస్ లో వైఎస్ఆర్ టీపీని విలీనం చేసేందుకు చివరివరకు షర్మిల విశ్వ ప్రయత్నాలే చేశారు. కానీ, షర్మిల ప్రయత్నాలు విఫలం అయ్యాయి. షర్మిల పార్టీ విలీనం విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ అంత ఇంట్రస్ట్ చూపించలేదు. దీంతో షర్మిల ఓ నిర్ణయానికి వచ్చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని డిసైడ్ అయ్యారు. రేపు మధ్యాహ్నం పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసిన షర్మిల ఇందులో ముఖ్యమైన నేతలతో చర్చించనున్నారు. ఆ తర్వాత ఎన్నికల కార్యాచరణ ప్రకటించబోతున్నారు.
119 నియోజకవర్గాల్లో పోటీ..
మొత్తం 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలిపేందుకు షర్మిల ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, వారిలో నుంచి మంచి అభ్యర్థులను ఎంపిక చేసి 119 నియోజకవర్గాల్లో పోటీలో దింపేందుకు షర్మిల రంగం సిద్ధం చేస్తున్నారు.
Also Read : ఆ రెండు ఎన్నికల్లో సక్సెస్.. అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్న కేసీఆర్!
ఆ రెండు చోట్ల నుంచి షర్మిల పోటీ?
ఇక ముందుగానే నిర్ణయించిన మేరకు పాలేరు నుంచి పోటీ చేయనున్నారు షర్మిల. అలాగే మిర్యాలగూడ నుంచి కూడా పోటీ చేయాలని షర్మిల నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అవసరమైతే రెండు చోట్ల నుంచి పోటీ చేసేందుకు షర్మిల రేపు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. దాంతో పాటు పాలేరుతో పాదయాత్ర చేసేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
రేపు కార్యవర్గ సమావేశంలో పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన తర్వాత ఎన్నికల ప్రచారం ఏ విధంగా ఉండబోతోంది? ఎంతమంది అభ్యర్థులను బరిలోకి దింపనున్నారు? పాలేరుతో పాటు మిర్యాలగూడ.. ఈ రెండు చోట్ల నుంచి షర్మిల పోటీ చేస్తారా? అన్న దానిపై రేపు మధ్యాహ్నం తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
కాంగ్రెస్ లో పార్టీ విలీనంపై షర్మిల చాలా ఆశలే పెట్టుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని నిన్నటి వరకు ఎదురుచూశారు. కానీ, షర్మిల ఆశలు ఫలించలేదు. ఢిల్లీ అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఒకానొక సమయంలో షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు లైన్ క్లియర్ అయ్యిందని, షర్మిలకు రాజ్యసభ సీటు కూడా ఇవ్వనున్నారని వార్తలు వచ్చాయి. కానీ, అవేవీ నిజం కాలేదు.
తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే తెలంగాణలో రాజకీయం చేయొచ్చని ముందు నుంచి షర్మిల భావించారు. అయితే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. షర్మిల రాకను తీవ్రంగా వ్యతిరేకించారు. షర్మిల రాకతో కాంగ్రెస్ కు నష్టమే తప్ప ఎలాంటి లాభమూ లేదని రేవంత్ రెడ్డి చాలా గట్టిగా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు తేల్చి చెప్పారు. అయినప్పటికీ షర్మిల విశ్వప్రయత్నాలు చేశారు. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సాయం కూడా తీసుకున్నారు. పార్టీ విలీనానికి సంబంధించి ఆయనతో రాయబారం నడిపారు. ఆయన ద్వారా కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసేందుకు ప్రయత్నించారు.
Also Read : ఎన్నికల కోడ్ అంటే ఏమిటి.. డబ్బు రవాణాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కానీ, కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి వాదనకే తలొగ్గినట్లు తెలుస్తోంది. షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసుకునేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఆసక్తి చూపించలేదు. చివరికి నిరాశ చెందిన షర్మిల ఇక ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించారు. రేపు అత్యవసరంగా పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు షర్మిల. ఈ సమావేశంలో ఎన్నికల కార్యాచరణ, ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలి? తన భవిష్యత్తు రాజకీయ కార్యాచరణపై షర్మిల కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.