YS Sharmila: కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనం ఖరారు? షర్మిలతో కలిసి ఒకే ఫ్లైట్‌లో హైదరాబాద్ చేరుకున్న ఎంపీ కోమటిరెడ్డి
కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనంపై మీడియాతో మాట్లాడడానికి షర్మిల నిరాకరించారు.

YS Sharmila, Komatireddy Venkat Reddy
YS Sharmila – Congress : కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ (YSRTP) విలీనం ఖరారయినట్లు తెలుస్తోంది. వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆమెతో కలిసి ఒకే ఫ్లైట్‌లో హైదరాబాద్ (Hyderabad) చేరుకున్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy).
కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనంపై మీడియాతో మాట్లాడడానికి షర్మిల నిరాకరించారు. త్వరలోనే అన్ని విషయాలపై ప్రకటన చేస్తానని వెళ్లిపోయారు. కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ షర్మిల తమ పార్టీలోకి వస్తే అందరూ ఆహ్వానిస్తారని చెప్పారు. అందరినీ కలుపుకొని పోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పైన ఉందని తెలిపారు.
షర్మిలను పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానానికి తన అభిప్రాయాన్ని చెబుతానని అన్నారు. తెలంగాణలో వైఎస్సార్ సంక్షేమ పథకాలు అందిన పేదవారందరూ కూడా.. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఆంధ్రాలో బీఆర్ఎస్ అధ్యక్షుడిని పెట్టుకున్నారని గుర్తు చేశారు. మరి షర్మిలను తెలంగాణ కాంగ్రెస్ లో చేర్చుకుంటే ఇక్కడ తప్పేంటని ఆయన నిలదీశారు. ఆమెను పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని అన్నారు.
Amit Shah : రాజద్రోహం చట్టం లేదు ఇకపై దేశ ద్రోహం మాత్రమే.. కొత్త చట్టాలే వర్తిస్తాయి : అమిత్ షా