Top Headlines : వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ చేరిన ఆసీస్.. ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించనున్న కాంగ్రెస్

కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసింది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే శుక్రవారం తెలంగాణకు వస్తున్నారు.

Top Headlines : వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ చేరిన ఆసీస్.. ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించనున్న కాంగ్రెస్

Top Headlines 11PM

వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ చేరిన ఆసీస్..
వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో టీమిండియాతో త‌ల‌ప‌డే జ‌ట్టు ఏదో తెలిసింది. కోల్‌క‌తా వేదిక‌గా జ‌రిగిన రెండో సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా విజ‌యం సాధించి ఫైన‌ల్‌కు దూసుకెళ్లింది. అహ్మ‌దాబాద్ వేదిక‌గా ఆదివారం (న‌వంబ‌ర్ 19న‌) ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్ తో ఆస్ట్రేలియా త‌ల‌ప‌డ‌నుంది.

సీఎం కేసీఆర్‌ సభలో బుల్లెట్ల కలకలం
సీఎం కేసీఆర్ పాల్గొన్న సభలో బుల్లెట్లు కలకలం సృష్టించాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఆ సభలో అస్లాం అనే వ్యక్తి దగ్గర రెండు బుల్లెట్లు దొరికాయి. పోలీసులు వెంటనే అస్లాంను అరెస్ట్ చేశారు.

బీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమన్న కేసీఆర్‌
కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు తెలంగాణకు అన్యాయం చేశాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ మాట్లాడారు. ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. తెలంగాణలో అభివృద్ధి బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. మరోసారి బీఆర్ఎస్ నే గెలిపించాలని కోరారు.

కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటించనున్న రాహుల్‌, ఖర్గే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. కాంగ్రెస్ దూకుడు పెంచింది. కాంగ్రెస్ అగ్రనేతలు తెలంగాణకు రానున్నారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ముఖ్య నేత రాహుల్ గాంధీ శుక్రవారం రాష్ట్రానికి వస్తున్నారు. వారు ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం తెలంగాణ ఎన్నికల కాంగ్రెస్ మ్యానిఫెస్టో ప్రకటించనున్నారు.

హైదరాబాద్‌కు అమిత్‌ షా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. జాతీయ పార్టీల నేతల మళ్లీ క్యూ కడుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం రాత్రి హైదరాబాద్ చేరుకోనున్నారు. శనివారం మూడు సభలలో పాల్గొననున్నారు.

స్కిల్‌ స్కామ్.. చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్‌
స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. ఇరువర్గాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా వాడీవేడిగా వాదనలు సాగాయి.