Dancing on highway: హైవేపై కారు ఆపి డ్యాన్సు చేసిన ఇద్దరు అమ్మాయిలు, యువకుడు.. వీడియో

Dancing on highway: హైవేపై కారు ఆపి డ్యాన్సు చేసిన ఇద్దరు అమ్మాయిలు, యువకుడు.. వీడియో

Updated On : December 12, 2022 / 12:59 PM IST

Dancing on highway: ఓ యువకుడు, ఇద్దరు అమ్మాయిలు హైవేపై కారులో వెళ్తున్నారు. ఇంతలో హైవే పక్కన కారుని ఆపి, అందులో నుంచి దిగారు. కెమెరా పట్టుకుని కారు ముందు నిలబడి డ్యాన్సు చేశారు. ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగేలా వ్యవహరించారు. వారి అత్యుత్సాహానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

చివరకు ఆ ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. యువకుడిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో చోటుచేసుకుంది. కౌశాంబి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ‘‘వైరల్ అయిన ఆ వీడియో డిసెంబరు 10న మా దృష్టికి వచ్చింది.

రోడ్డుపై ఇద్దరు అమ్మాయిలు, ఓ యువకుడు డ్యాన్సు చేశారు. రోడ్డును బ్లాక్ చేసి వాహనదారులకు ఇబ్బంది కలిగించారు. యువకుడిని అరెస్టు చేసి, కారును స్వాధీనం చేసుకున్నాము’’ అని ఘజియాబాద్ పోలీసులు ట్వీట్ చేశారు.

రాత్రి వేళ ఆ ఇద్దరు అమ్మాయిలు, యువకుడు రోడ్లపై కారులో తిరుగుతూ, రోడ్డుపైనే డ్యాన్సులు చేసిన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కామెంట్లు చేశారు.

Viral Video: యువకుడిని ట్రక్కు ముందు భాగంలో తాడుతో కట్టి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన వైనం