MAA Elections: కంచులా మోగుతున్న మంచు.. ఈ పదవులు విష్ణు ప్యానెల్‌వే..!

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో.. మంచు విష్ణు ప్యానెల్.. కీలకమైన విజయాన్ని సొంతం చేసుకున్నట్టు కౌంటింగ్ ట్రెండ్స్ చెబుతున్నాయి.

MAA Elections: కంచులా మోగుతున్న మంచు.. ఈ పదవులు విష్ణు ప్యానెల్‌వే..!

Vishnu Pannel

Updated On : October 10, 2021 / 8:34 PM IST

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో.. మంచు విష్ణు ప్యానెల్.. కీలకమైన విజయాన్ని సొంతం చేసుకున్నట్టు కౌంటింగ్ ట్రెండ్స్ చెబుతున్నాయి. ట్రెజరర్ గా విష్ణు ప్యానెల్ నుంచి పోటీలో ఉన్న శివబాలాజీ.. విజయం సాధించినట్టు తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీ చేసిన నాగినీడుపై.. 32 ఓట్ల తేడాతో.. శివబాలాజీ గెలిచినట్టు సమాచారం.

మరోవైపు.. జెనరల్ సెక్రటరీగా మంచు విష్ణు ప్యానెల్ నుంచి బరిలో ఉన్న రఘుబాబు గెలిచినట్టు తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు చెందిన జీవితారాజశేఖర్ పై.. 7 ఓట్ల తేడాతో.. రఘుబాబు విజయాన్ని సాధించినట్టు సమాచారం అందుతోంది.

ఇదే సమయంలో.. ప్రెసిడెంట్ గా మంచు విష్ణు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు చెందిన శ్రీకాంత్ ఆధిక్యంలో ఉన్నట్టు సమాచారం అందుతోంది.

Also Read:

MAA Elections: నరాలు తెగే ఉత్కంఠ నడుమ.. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు సరదా ముచ్చట్లు..!

MAA Elections: మా.. ఎన్నికల్లో.. తొలి ఫలితం.. గెలిచిందెవరంటే..!

MAA Elections counting: ఈసీ మెంబర్స్.. లీడ్‌లో ప్రకాష్ రాజ్ టీమ్..?

Maa Elections 2021: చేతిని కొరికిన హేమ.. మనిషి కాటు ప్రమాదమే.. హాస్పిటల్‌కు శివబాలాజీ!