Viral Video: రైల్వే స్టేషన్‏లో ఇష్టం వచ్చినట్లు ప్రయాణికుల తన్నులాట

ప్రయాణికులను రైల్లోకి ఎక్కనివ్వకుండా కొందరు ఫుట్ బోర్డుపై నిలబడ్డారు. దీంతో ప్లాట్ ఫాం మీద ఉన్న ప్రయాణికులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు.

Viral Video: రైల్వే స్టేషన్‏లో ఇష్టం వచ్చినట్లు ప్రయాణికుల తన్నులాట

Viral Video

Updated On : April 5, 2023 / 4:59 PM IST

Viral Video: కొందరు ప్రయాణికులు రైళ్లలో, బస్సులలో ఫుట్ బోర్డు మీద నిలబడి తోటి ప్రయాణికులు చాలా ఇబ్బంది కలిగిస్తుంటారు. ఎవరు ఎంతగా చెప్పినా వినిపించుకోరు. తోటి ప్రయాణికులను ఎక్కనివ్వకుండా, దిగనివ్వకుండా ఫుట్ బోర్డు మీద నిలబడుతుంటారు. ఇటువంటి కొందరు ప్రయాణికుల తీరే ఓ రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు ఇష్టం వచ్చినట్లు కొట్టుకునేలా చేసింది.

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని థానె, దివా జంక్షన్ రైల్వే స్టేషన్ (Diva Junction railway station) ప్రయాణికులతో కిక్కిరిసి పోయింది. రైలు వచ్చి ఆగాక అందులో ఎక్కడానికి ప్రయాణికులు ఎగబడ్డారు. ప్రయాణికులను రైల్లోకి ఎక్కనివ్వకుండా కొందరు ఫుట్ బోర్డుపై నిలబడ్డారు. దీంతో ప్లాట్ ఫాం మీద ఉన్న ప్రయాణికులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. ఫుట్ బోర్డుపై అడ్డంగా నిలబడిన వారిని కొట్టారు.

ఒకరిని ప్లాట్ పాం మీదకు లాగి, కింద పడేసి తన్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ ప్రయాణికులు వీడియో తీశాడు. చివరకు కింద పడిపోయి తన్నులు తింటున్న వ్యక్తిని ఇద్దరు ప్యాసింజర్లు వచ్చి రక్షించి అక్కడి నుంచి పంపించారు. మరోసారి ఫుట్ బోర్డుపై నిలబడి తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించవద్దని బుద్ధి చెప్పారు.

North Korea: తీవ్ర కలకలం.. అణు పరీక్షలకు ఉత్తర కొరియా సిద్ధం.. అణ్వస్త్ర సామర్థ్య బాంబర్లను పంపిన అమెరికా