Viral Video: అసాధారణ వేగంతో పరిగెత్తిన చీతా.. వీడియో వైరల్

వేటాడే సమయంలో ఈ చిరుత ఒక్కో అడుగుకు 6.7 మీటర్ల దూరం దూకుతూ వెళ్లిందని ట్విట్టర్ లో అధికారులు వివరించారు. గంటలకు 70 మైళ్ల దూరాన్ని అందుకుని మరీ పరిగెత్తిందని తెలిపింది. ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఇది వైరల్ అయింది.

Viral Video: అసాధారణ వేగంతో పరిగెత్తిన చీతా.. వీడియో వైరల్

Viral Video

Updated On : January 9, 2023 / 9:46 AM IST

Viral Video: చీతాలు ఎంత వేగంగా పరిగెడతాయో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. అందులో అసినోనిక్స్ జుబాటస్ జాతికి చెందిన చీతాలు భూమిపై ఉన్న అన్ని జంతువుల కంటే వేగంగా పరిగెడతాయి. సాధారణంగా ఈ చీతాలకు గంటకు 60 మైళ్ల దూరం పరిగెత్తే సామర్థ్యం ఉంటుంది. తాజాగా ఓ చీతాకు అంతకు మించిన వేగంతో పరిగెత్తి అందరినీ ఆశ్చర్యపర్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

వేటాడే సమయంలో ఈ చిరుత ఒక్కో అడుగుకు 6.7 మీటర్ల దూరం దూకుతూ వెళ్లిందని ట్విట్టర్ లో అధికారులు వివరించారు. గంటలకు 70 మైళ్ల దూరాన్ని అందుకుని మరీ పరిగెత్తిందని తెలిపింది. ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఇది వైరల్ అయింది. అది పరిగెడుతున్న సమయంలో దాని ముఖం, కాళ్లు, బాడీ మొత్తం కదిలిన తీరు ఆశ్చర్యపరుస్తోంది. లక్ష్యం జారిపోకుండా అందుకోవడం కోసం ఈ చిరుత పరిగెత్తిన తీరు స్ఫూర్తిమంతంగా ఉందని కొందరు నెటిజన్లు పేర్కొన్నారు.

చిరుతలు అంత వేగంగా పరుగులు తీయడానికి వాటికి అనువుగా ఉండే వెన్నుముకే కారణమని అన్నారు. ఆ చిరుత పరుగుతు తీస్తున్న సమయంలో ఎలా వీడియో తీశారని పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. మొత్తానికి ఈ చిరుత వీడియోపై నెటిజన్లు అమితాసక్తి కనబర్చుతున్నారు. ఈ వీడియోను ఇప్పటికే కోటి మందికిపైగా చూశారు.

China-Taiwan: 57 యుద్ధ విమానాలతో తైవాన్ చుట్టూ చైనా దుందుడుకు చర్యలు