10టీవీ ఎఫెక్ట్ : యురేనియం తవ్వకాలు నిలిపివేత

టెన్ టీవీ ఎఫెక్ట్‌తో కర్నూలు జిల్లాలో యూరేనియం కోసం అన్వేషణ పూర్తిగా ఆగిపోయింది. ఆళ్లగడ్డ నియోజకవర్గం యాదవాడ సమీపంలో యురేనియం కోసం అన్వేషణ జరుగుతున్న విషయాన్ని 10 టీవీ బయటపెట్టింది.

  • Published By: veegamteam ,Published On : October 1, 2019 / 03:20 PM IST
10టీవీ ఎఫెక్ట్ : యురేనియం తవ్వకాలు నిలిపివేత

Updated On : October 1, 2019 / 3:20 PM IST

టెన్ టీవీ ఎఫెక్ట్‌తో కర్నూలు జిల్లాలో యూరేనియం కోసం అన్వేషణ పూర్తిగా ఆగిపోయింది. ఆళ్లగడ్డ నియోజకవర్గం యాదవాడ సమీపంలో యురేనియం కోసం అన్వేషణ జరుగుతున్న విషయాన్ని 10 టీవీ బయటపెట్టింది.

టెన్ టీవీ ఎఫెక్ట్‌తో కర్నూలు జిల్లాలో యూరేనియం కోసం అన్వేషణ పూర్తిగా ఆగిపోయింది. ఆళ్లగడ్డ నియోజకవర్గం యాదవాడ సమీపంలో యురేనియం కోసం అన్వేషణ జరుగుతున్న విషయాన్ని 10 టీవీ బయటపెట్టింది. రైతులకు చెప్పకుండానే.. వారి భూముల్లో సౌత్ వెస్ట్ పినాకిల్ సంస్థ యురేనియం కోసం అన్వేషణ చేపట్టింది. అయితే.. ఈ విషయం టెన్ టీవీ బయటపెట్టడంతో సౌత్ వెస్ట్ పినాకిల్ సంస్థ పనులు నిలిపివేసింది.. సామాగ్రిని సైతం తీసుకుని వెళ్లిపోయింది. 
 
కర్నూలు జిల్లాలో యురేనియం అన్వేషణ కోసం సౌత్‌వెస్ట్ పినాకిల్ సంస్థ తవ్వకాలు చేపట్టింది. నంద్యాల, ఆళ్లగడ్డ పరిధిలో 15చోట్ల యురేనియం కోసం అన్వేషణ జరిపింది. ఆళ్లగడ్డ మండలం యాదవాడ సమీపంలో కోర్‌ డ్రిల్లింగ్ పనులు చేపట్టింది. దీనిపై టెన్‌టీవీ కథనాలు ప్రసారం చేసే వరకు స్థానికులకు యురేనియం అన్వేషణ జరుగుతుందన్న విషయం తెలియలేదు. బోరు బావుల కోసం తవ్వుతున్నారని అందరూ భావించారు. 

జరుగుతున్న తవ్వకాలు.. యురేనియం కోసం అన్న విషయాన్ని టెన్‌టీవీ బయట పెట్టడంతో.. స్థానికులు అలర్ట్ అయ్యారు. యరేనియం తవ్వకాలను నిలిపివేయాలని లేకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అటు టెన్‌టీవీ కథనాలు ప్రసారం చేయడం… స్థానికుల ఆందోళనతో యురేనియం తవ్వకాలకు బ్రేక్ పడింది.