సంక్రాంతికి 2,350 ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

సంక్రాంతి పండుగకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా  2,350 ప్రత్యేక బస్సులు నడపనుంది.

  • Published By: veegamteam ,Published On : December 27, 2019 / 03:39 AM IST
సంక్రాంతికి 2,350 ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Updated On : December 27, 2019 / 3:39 AM IST

సంక్రాంతి పండుగకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా  2,350 ప్రత్యేక బస్సులు నడపనుంది.

సంక్రాంతి పండుగకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా  2,350 ప్రత్యేక బస్సులు నడపనుంది. హైదరాబాద్‌కు ఇప్పటికే రెగ్యులర్‌గా 527 బస్సులు నడుపుతోంది. వీటికి అదనంగా ప్రత్యేక బస్సులు నడుస్తాయని  ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు. అవసరాన్ని బట్టి వీటి సంఖ్యను పెంచుతామని  వెల్లడించారు.

సంక్రాంతి సందర్భంగా టీఎస్‌ ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను నడపుంది. సంక్రాంతి కోసం 4వేల 940 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.  జనవరి 10 తేదీ నుంచి 13వ తేదీ వరకు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. ఎంజీబీఎస్‌, జూబ్లీ బస్‌స్టేషన్‌ల నుంచి పలు ప్రాంతాలకు సర్వీసులు నడుపుతామని తెలిపారు. ప్రయాణికులు ముందుగా రిజర్వేషన్‌ చేసుకునే సౌకర్యం ఉందని, ఆర్టీసీలో ప్రయాణించి భద్రంగా ఇళ్లకు చేరాలని సూచించారు. 

ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగకే కాంకుడా మిగిలిన పండుగులకు కూడా ఆర్టీసీ అదనపు బస్సులను నడుపుతుంది. గ్రామాల నుంచి వచ్చిన వేల సంఖ్యలో ప్రజలు వివిధ పనులు చేస్తూ హైదరాబాద్ లో ఉంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు వచ్చిన ప్రజలు సంక్రాంతికి తమ సొంతూళ్లకు పయనమవుతారు. గ్రామాలకు వెళ్తున్న జనంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతాయి.  

ఉద్యోగాలు, కూలీ పనులు చేసుకోవడానికి వచ్చిన జనం, చదువు కోవడానికి వచ్చిన విద్యార్థులు సైతం సొంతూర్లకు పయనమవుతారు. ఈ క్రమంలో పండుగల సందర్భంగా హైదరాబాద్ నగరం సగం వరకు ఖాళీ అవుతుంది. నగరంలోని రోడ్లు, వీధులు నిర్మానుష్యంగా కనిపిస్తాయి. చాలా ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది.