ఇనుమెట్ల పోలింగ్ కేంద్రాన్ని ఆక్రమించాలని కోడెల కుట్ర : అంబటి

టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాద్ రావు తీరుపై వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాంబు ఫైర్ అయ్యారు. వైసీపీ ఓటర్లను భయపెట్టేందుకే కోడెల ఇనుమెట్ల గ్రామానికి వచ్చారని ఆరోపించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇనుమెట్ల పోలింగ్ కేంద్రాన్ని ఆక్రమించాలని కోడెల కుట్ర పన్నారని ఆరోపించారు. ఓటమి అంగీకరించి ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సత్తెనపల్లిలో టీడీపీ నుంచి కోడెల శివప్రసాద్ రావు, వైసీపీ నుంచి అంబటి రాంబాబు బరిలో ఉన్నారు.
కోడెల శివప్రసాదరావు కారుపై వైసీసీ కార్యకర్తలు దాడి చేశారు. కోడెల పోలింగ్ కేంద్రానికి వెళ్తున్న సమయంలో వైసీపీ కార్యకర్తలు ఆయన కారుని అడ్డగించారు. కారుని చుట్టుముట్టారు. కారు పైకి ఎక్కి రాళ్లతో దాడి చేశారు. అంతటితో ఆగకుండా కారు డోరు తెరిచి డ్రైవర్, గన్ మెన్ పైనా దాడి చేశారు. నానా బీభత్సం చేశారు. ఈ దాడిలో డ్రైవర్ కి గాయాలు అయ్యాయి. వైసీపీ కార్యకర్తల దాడి నుంచి ఎలాగో అలా కోడెల బయటపడ్డారు. అక్కడి నుంచి కారులో పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. పోలింగ్ కేంద్రం దగ్గర కూడా కోడెలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. పోలింగ్ బూత్ లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారని.. బూత్ ఆక్రమించుకుని రిగ్గింగ్ చేయటానికి ప్రయత్నించటం వల్లే దాడి జరిగినట్లు చెప్పుకొచ్చారు సత్తెనపల్లి వైసీపీ అభ్యర్థి అంబటి