బ్యాలెట్ పేపరే బెస్ట్: కనకమేడల

అమరావతి : బీజేపీ ప్రభుత్వం ఎలక్షన్ కమీషన్ మీద పెత్తనం మానుకోవాలని..బ్యాలెట్ పేపర్ తో ఎన్నికల విధానం తీసుకురావలని టీడీపీ డిమాండ్ చేస్తోందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు. బ్యాలెట్ పేపర్స్ ను వ్యతిరేకించి ఈవీఎంలను అమలులోకి తీసుకొచ్చిన బీజేపీ ఇప్పుడు ఎందుకు ఈ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చిందని ప్రశ్నించారు. బ్యాలెట్ పేపర్ విధానంతో ఎన్నికలు నిర్వహిస్తే ఎకౌంటబిలిటీ వుంటుందని..సీక్రెట్ ఓటింగ్ ఉంటుందనీ..ఈ విషయంలో రాజకీయ వివాదాలు..వ్యక్తిగత వివాదాలు లేకుండా ప్రభుత్వం అమలు చేయాలని కనకమేడల డిమాండ్ చేశారు. ఎన్నికలల్లో ప్రక్రియకు విఘాతం కలగకుండా..ప్రజాస్వామ్య పరిరణక్ష, రాజ్యాంగ సంరక్షణ కోసం బ్యాలెట్ పేపర్ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషణ్ కు ఎంపీ కనక మేడల విజ్నప్తి చేశారు. ఈవీఎంలపై ఉన్న అనుమానాలను తీర్చవలసని బాధ్యత ఎన్నికల కమిషన్ పై ఉందని ఎంపీ కనక మేడల పేర్కొన్నారు.