నిరసన సెగ: ఎమ్మెల్యే రేగాను నిలదీసిన ప్రజలు

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే రేగా కాంతారావుకు చేదు అనుభవం ఎదురైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం రెడ్డిపాలెంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేగా కాంతారావును ప్రజలు అడ్డుకున్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఉన్నాని ఓటు వేస్తే ఓట్లు వేసిన ప్రజలను మోసం చేసి పార్టీ మారుతారా? అంటూ నిలదీశారు. కాంగ్రెస్ నుంచి గెలిచి.. టీఆర్ఎస్‌లోకి వెళ్లడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్‌లో గెలిచి టీఆర్ఎస్‌కు మద్దతుగా ఎలా ప్రచారం చేస్తారంటూ నిలదీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనుచరులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకోగా ప్రచారంలో పాల్గొనకుండానే ఎమ్మెల్యే రేగా కాంతారావు వెనుదిరిగి వెళ్లిపోయారు.