చిన్నారి రూ.లక్ష విరాళం: చంద్రబాబు మళ్లీ సీఎం కావాలి

  • Published By: veegamteam ,Published On : April 2, 2019 / 06:30 AM IST
చిన్నారి రూ.లక్ష విరాళం: చంద్రబాబు మళ్లీ సీఎం కావాలి

Updated On : April 2, 2019 / 6:30 AM IST

ముదినేపల్లి : ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి సీఎం కావాలని ఓ చిన్నారి ఆకాంక్షించింది. దాని కోసం ఏకంగా రూ.లక్ష రూపాయల్ని విరాళంగా ఇచ్చింది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఘన విజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలని ఆకాంక్షిస్తూ కృష్ణాజిల్లా ముదినేపల్లికి చెందిన అంబుల వైష్ణవి అనే చిన్నారి తిరుమల వెంకటేశ్వరస్వామికి రూ.లక్ష విరాళంగా సమర్పించింది. 
 

దీనికి సంబంధించిన డిపాజిట్‌ ప్రతాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో బి.లక్ష్మీకాంతంకు సోమవారం (ఏప్రిల్1) పంపించింది. అంతేకాదు చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే రోజునే శ్రీవారిని దర్శించుకుంటాననీ..తిరుమలకు నడిచి వస్తానని మొక్కుకుంది వైష్ణవి. పోలవరం ప్రాజెక్టు కోసం తన తండ్రి డాక్టర్‌ మనోజ్‌ సహకారంతో ఎకరం భూమి రాసిస్తానని కూడ వైష్ణవి చెప్పటం మరో విశేషం.