మానవత్వమే నా మతం..మాట నిలుపుకోవటమే నా కులం : సీఎం జగన్

  • Published By: veegamteam ,Published On : December 2, 2019 / 07:17 AM IST
మానవత్వమే నా మతం..మాట నిలుపుకోవటమే నా కులం : సీఎం జగన్

Updated On : December 2, 2019 / 7:17 AM IST

గుంటూరులో సీఎం జగన్ ఆరోగ్య ఆసరా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ప్రతీ పక్షాలు పదే పదే నా మతం గురించి..విమర్శలు చేస్తున్నారనీ..వారికి ఇదే నా సమాధానం అంటూ..‘‘మానవత్వమే నా మతం..మాట నిలుపుకోవటమే నా కులం’’ అని అన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్ధేశ్యంతో ‘ఆరోగ్య ఆసరా’పథకాన్ని ప్రారంభించామన్నారు. 1060 అంబులెన్స్  లను కొనుగోలు చేసి ప్రజల సేవల కోసం వినియోగిస్తామని హామీ ఇచ్చారు.

కాల్ చేసిన 10 నిమిషాల్లో అంబులెన్స్ 
1060 అబులెన్స్ లను కొనుగోలు చేసి 2020 ఏప్రిల్ నాటికల్లా  అందుబాటులోకి తీసుకొస్తామనీ.. 104,108 నంబర్లకు ఫోన్ చేస్తే10 నిమిషాల్లోనే అంబులెన్స్ సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. అంబులెన్స్ లో పేషెంట్లను తీసుకొచ్చి మంచి హాస్పిటల్ లో చేర్పించి..ఉచితంగా వైద్య సేవల్ని అందించి పూర్తి ఆరోగ్యంగా చిరునవ్వుతో తిరిగి వారి ఇళ్లకు వెళ్లేలా చేస్తామన్నారు.  ఆరోగ్య ఆసరా పథకం ద్వారా ప్రజలకు ఆరోగ్యాన్ని అందిస్తామని..అనారోగ్యానికి గురైన ఎవ్వరూ బాధపడాల్సిన పనిలేదని  సీఎం జగన్ భరోసా ఇచ్చారు. 
పేషెంట్ కోలుకునే సమయంలో కూడా ఆర్థిక సహాయం 
చికిత్స ద్వారా కోలుకునే సమయంలో కూడా బాధితులకు ఆర్థిక సహాయం అందేలా నెలకు రూ.5వేలు..లేదా రోజుకు రూ.225 అందజేస్తామన్నారు. దీనికి సంబంధించిన చెక్కును స్వయంగా పేషెంట్ చేతికే అందిస్తామన్నారు. ఈ సేవలన్నీ 2020 ఏప్రిల్ నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని సీఎం జగన్ ప్రజలకు ఆరోగ్య హామీని ఇచ్చారు.
వైఎస్సార్ కంటి వెలుగు పథకంతో ఉచితంగా పరీక్షలు  
తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపే వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ప్రజలు ఉచితంగా కంటి పరీక్షలు చేసేలా ఆక్టోబర్ 10 ప్రారంభించామని సీఎం తెలిపారు. 66 లక్షల మంది స్కూల్ పిల్లలకు ఉచితంగా కంటి పరీక్షలు చేయించమనీ..ఈ పథకాన్ని అన్ని వర్గాలకు విస్తరిస్తామనీ త్వరలోనే మరో ఆరు నెలల్లో వృద్ధులకు కూడా ఈ పథకం ద్వారా ఉచిత కంటిపరీక్షలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలా ఈ పథకాన్ని అందరికీ వర్తించేలా చేస్తామన్నారు.   
ఆరోగ్య శ్రీ పథకంలో పెను మార్పులు తీసుకొస్తూ.. నవంబర్ 1 నుంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ప్రజలకు వైద్యాన్ని అందిస్తున్నామని చెప్పటానికి గర్వంగా ఉందన్నారు.
గవర్నమెంట్ హాస్పిటల్స్ లోను 510 రకాల మందులు 
డిసెంబర్ 15 నాటికి ప్రతీ గవర్నమెంట్ హాస్పిటల్ లోను..510 రకాల మందులను అందుబాటులో ఉండేలా చేస్తామనీ..దానికి సంబంధించిన చర్యల్ని తీసుకుంటున్నామని తెలిపారు.