అవినీతి ఉండకూడదు : ఇసుక విధానంపై సీఎం జగన్ సమీక్ష

ఇసుక విధానంలో ఎట్లాంటి పరిస్థితుల్లో అవినీతి ఉండకూడదు..ప్రజలకు ఇబ్బందులు కలుగకూడదు..అంటూ సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకట్ట వేసేందుకు..ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకూడదని సీఎం జగన్ నూతన ఇసుక విధానాన్ని రూపొందించారు. పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి సెప్టెంబర్ 11వ తేదీ బుధవారం అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు.
ఇసుక విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై చాలా మంది రాళ్లేయడానికి చూస్తున్నారు..విమర్శలు రాకుండా చూడాలని సూచించారు. స్టాక్ యార్డు పాయింట్ల సంఖ్య పెంచి..ఇసుక మాఫియా లేకుండా చేయడానికి సాంకేతిక సహకారం తీసుకోవాలన్నారు. అక్రమ రవాణా అడ్డుకొనేందుకు చెక్ పోస్టులో వద్ద సీసీ కెమెరాలు పెట్టాలన్నారు. బల్క్ యూజర్ల కోసం ప్రత్యేక స్టాక్ యార్డులు ఏర్పాటు..ఇసుక విషయంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని సీఎం జగన్ స్పష్టమైన ఆదేశశాలు జారీ చేశారు. ఇసుక రవాణా విషయంలో ఇబ్బందులు అధిగమించాన్నారు