ఎంపీ రఘురామకృష్ణంరాజుపై సీఎం జగన్ సీరియస్

సీఎం జగన్ తో ఎంపీ రఘురామకృష్ణంరాజు భేటీ అయ్యారు. ఇంగ్లీష్ మీడియంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని ఆయనపై సీఎం సీరియస్ అయ్యారు.

  • Published By: veegamteam ,Published On : November 22, 2019 / 01:50 PM IST
ఎంపీ రఘురామకృష్ణంరాజుపై సీఎం జగన్ సీరియస్

Updated On : November 22, 2019 / 1:50 PM IST

సీఎం జగన్ తో ఎంపీ రఘురామకృష్ణంరాజు భేటీ అయ్యారు. ఇంగ్లీష్ మీడియంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని ఆయనపై సీఎం సీరియస్ అయ్యారు.

సీఎం జగన్ తో ఎంపీ రఘురామకృష్ణంరాజు భేటీ అయ్యారు. ఆయన వెంట ఎంపీలు మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి ఉన్నారు. ఇంగ్లీష్ మీడియంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని రఘురామకృష్ణంరాజుపై సీఎం సీరియస్ అయ్యారు. దీంతో తన వ్యాఖ్యలను వక్రీకరించారని జగన్ కు ఆయన వివరణ ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం ఇంగ్లీష్ మీడియంకు సంబంధంచి రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి ఆయన వివరణ తీసుకోవాల్సిందిగా పార్టీ కీలక నేత, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల ఇంచార్జ్ వైవి సుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. 

ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న క్రమంలో కృష్ణంరాజుపై అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. ఆయన బీజేపీలో చేరుతారంటూ అనేక ప్రచారాలు చేస్తున్నారు. దీంతోపాటు వైసీపీ ఎంపీలు తమతో టచ్ లో ఉన్నారంటూ బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్స్ నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు సీఎం జగన్ ఇంటికి వచ్చి కలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన పరిణామంగా చెప్పవచ్చు. ఆలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సివచ్చింది, ఏ పరిస్థితుల్లో చేయాల్సివచ్చిందన్న అంశాలపై ఆయన సీఎం జగన్ కు వివరణ ఇవ్వనున్నారు.