వరాలు కురిపిస్తారా : హుజూర్ నగర్‌కు సీఎం కేసీఆర్

హుజూర్ నగర్ ఉప ఎన్నికకు రోజులు దగ్గర పడుతున్నాయి. నియోజకవర్గంలో విజయం సాధించాలని అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు శతవిధాల ప్రయత్నిస్తున్నాయి. ప్రచార జోరును పెంచాయి. ఒకరిపై ఒకరిపై విమర్శలు గుప్పించుకుంటుండడంతో రాజకీయ వేడి రగులుకుంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ అక్టోబర్ 17వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు భారీ బహిరంగసభలో పాల్గొననున్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లు టీఆర్ఎస్ శ్రేణులు పూర్తి చేశారు. సభకు భారీగా జనసమీకరణ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే..బహిరంగసభలో కేసీఆర్ ఏమి మాట్లాడుతారన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె కాక పుట్టిస్తోంది. సమ్మెకు సంబంధించిన విషయాన్ని ప్రస్తావిస్తారా ? సీపీఐ పార్టీ మద్దతు ఉపసంహరణపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనే దానిపై చర్చ జరుగుతోంది. ఆర్టీసీ సమ్మెకు పార్టీలు, వివిధ సంఘాలు మద్దతు పలికిన సంగతి తెలిసిందే. సమ్మె నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కేసీఆర్‌ను అడ్డుకొనేందుకు ప్రయత్నించవచ్చనే ఊహాగానాల నడుమ కార్మికులను ముందస్తు అరెస్టులు చేస్తారా అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి.
టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సైదిరెడ్డి శానంపూడి బరిలో నిలవగా కాంగ్రెస్ తరపున ఎంపీ ఉత్తమ్ సతీమణి పద్మావతి పోటీ చేస్తున్నారు. బీజేపీ పార్టీ నుంచి కోట రామారావు బరిలో ఉన్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలు, బహిరంగసభలతో విస్తృతంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీల కీలక నేతలు నియోజకవర్గంలో మోహరించి ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు.
Read More : పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం శుభవార్త
గత ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయ డంతో హుజూర్ నగర్‌కు ఉప ఎన్నిక అనివార్యమైంది. సిట్టింగ్ స్థానం కాబట్టి తిరిగి దక్కించుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. అక్టోబర్ 21న పోలింగ్ జరుగనుంది. అక్టోబర్ 24న ఓట్ల లెక్కింపు చేపడుతారు.
ఈ నెల 17న హుజూర్ నగర్ లో జరుగు భారీ బహిరంగ సభ@KTRTRS @RaoKavitha @MPsantoshtrs @varuntrs58 @trsinnews @trspartyonline @TelanganaCMO pic.twitter.com/BLlhGpW7wH
— Saidi Reddy Shanampudi (@TRSSaidireddy) October 16, 2019