జగన్‌పై స్పీకర్‌కు ఫిర్యాదు: ప్రివిలైజ్ మోషన్ ఇచ్చిన టీడీపీ

  • Published By: vamsi ,Published On : December 13, 2019 / 10:15 AM IST
జగన్‌పై స్పీకర్‌కు ఫిర్యాదు: ప్రివిలైజ్ మోషన్ ఇచ్చిన టీడీపీ

Updated On : December 13, 2019 / 10:15 AM IST

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌ను టీడీపీ ఎమ్మెల్యేల బృందం కలిసింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు అనని మాటలను అన్నట్లుగా సీఎం జగన్ వక్రీకరించారంటూ సీఎంపై ప్రివిలైజ్ నోటీస్ ఇచ్చారు ప్రతిపక్ష నాయకులు. ఈ మేరకు స్పీకర్ తమ్మినేని సీతారాంను కలిసి ప్రివిలైజ్ మోషన్ ఇచ్చారు టీడీపీ నేతలు. ఏపీ అసెంబ్లీ బయట మార్షల్స్‌కు, టీడీపీ సభ్యులకు మధ్య జరిగిన ఘటనపై అసెంబ్లీలో పెను దుమారం రేగింది.

ఈ సంధర్భంగా అసెంబ్లీలోకి వస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబును, టీడీపీ సభ్యులను మార్షల్స్ అడ్డుకోగా.. తనను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణం అయ్యింది.

ఈ ఘటనకు సంబంధించి వీడియోను అసెంబ్లీలో అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ శుక్రవారం అసెంబ్లీలో ప్రదర్శించింది. చీఫ్ మార్షల్స్‌ను చంద్రబాబు ‘బాస్టెడ్‌’ అని అన్నారంటూ ఈ సంధర్భంగా సీఎం జగన్ ఆరోపించారు. ‘నో క్వశ్చన్‌’ పదాన్ని బాస్టెడ్‌గా చిత్రీకరించారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే లేని దానిని ఉన్నట్లుగా అసెంబ్లీలో చూపించారంటూ విమర్శించారు చంద్రబాబు. తన నోటి నుంచి ఎప్పుడు బూతులు రావని, ఎప్పుడైనా కోపం వస్తే గట్టిగా మాట్లాడతానే తప్ప పరుష వ్యాఖ్యలు చేయడం చేతకాదని అన్నారు చంద్రబాబు.